Telugu-girl-displayes-dancing-talents-in-WhiteHouse

అమెరికాలో తెలుగు యువతి ప్రతిభ.. వైట్‌హౌస్‌లోనూ నృత్యం

  • విదేశీ సిగలో విరిసిన కూచిపూడి కుసుమం
  • అమెరికాలో ఒంగోలు యువతి అంబికాశ్రీ ప్రతిభ
  • రెండుసార్లు నృత్యంలో గిన్నిస్‌ బుక్‌లో స్థానం
  • పి.సుశీల, చిత్ర వంటి ప్రముఖ గాయకుల ప్రశంసలు
  • వైట్‌హౌస్‌లోనూ నృత్య ప్రదర్శన

ఒంగోలు (కల్చరల్‌): ప్రపంచ దేశాల్లో కెల్లా భారతదేశం కళలకు, సంస్కృతికి పుట్టినిల్లయితే, అందులో ఆంధ్రదేశం వాటికి పెట్టింది పేరు. ఎందరో కళాకా రులు తెలుగుజాతి గొప్పదనపు బావుటాను కీర్తిశిఖరాలపై ఎగుర వేశారు. ఇక ప్రకాశం జిల్లా కూడా కళలకు తక్కువేమీ కాదు.కళల కు కాణాచిగా పేరుపొందింది.అయితే ఇటీవల కాలంలో కళలు అంతరించి పోతున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తూ, నేటి యువత కళలపట్ల కంటే పాశ్చాత్య నాగరికతవైపు ఎక్కువగా మో జు చూపుతున్నారని ఆరోపిస్తున్నారు. కానీ పాశ్చాత్య దేశంలో ఉ న్నప్పటికీ, మనవైన సంప్రదాయ కళల పట్ల ఎంతో మక్కువ చూపిస్తూ రాణిస్తోంది ఒంగోలుకు చెందిన ‘శిద్దాబత్తుల అంబిక శ్రీ’.చిన్నతనం నుంచి తల్లిదండ్రుల ప్రోత్సాహంతో కూచిపూడి నృత్యంలో శిక్షణ పొంది మంచి అభినయం కలిగిన నృత్య కళా కారిణిగా గుర్తింపు పొందటమే కాకుండా అమెరికా అధ్యక్షుని అధి కారిక భవనమైన వైట్‌హౌస్‌లో ప్రదర్శన ఇచ్చే అవకాశాన్ని సొం తం చేసుకుంది. ఇక తన నృత్యంతో గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డులో రెండుసార్లు స్థానం సంపాదించింది. మన నృ త్యకళను అభ్యసిస్తూ అంచెలంచెలుగా ఎదుగుతోంది అంబిక శ్రీ. 

 

చిన్నతనం నుంచే నృత్యంలో శిక్షణ

ఒంగోలుకు చెందిన పూర్ణజ్యోతికి, తన మేనత్త కొడుకు రామకృష్ణ దేశాయ్‌తో వివాహం జరిగింది. రామకృష్ణ దేశాయ్‌ ఉద్యోగరీత్యా అమెరికాలో ఉంటున్నారు. వారిద్ద రికీ 2001 ఏప్రిల్‌ 20న జన్మించింది అంబికాశ్రీ. తమ కుమార్తెకు ఏదైనా ఒక శాస్ర్తీయ కళలో శిక్షణనిప్పించాలనే తల్లిదండ్రుల ఆలోచనకు అనుగుణంగా తన మూడు సంవత్సరాల వయసులో అంటే 2004లో కూచిపూడి నృ త్యంలో శిక్షణ తీసుకోవటం ప్రారంభించింది.తొలుత అ క్కడే ఉంటున్న నృత్య శిక్షకురాలు రాజశ్రీ పాకాళ దగ్గర ఐదు సంవత్సరాలు, ఆ తర్వాత ప్రముఖ కూచిపూడి గురు వు వెంపటి చినసత్యం తొలి శిష్యురాలైన సుభామా ర్వాడ దగ్గర కూచిపూడిలో మెళకువలు నేర్చుకుంది.ఒకవైపు చదువు మరొకవైపు నృత్యం రెంటినీ రెండు కళ్లుగా భావించి కఠోరమైన సాధన చేస్తూ ఒక మంచి కూచిపూడి నృత్యకళా కారిణిగా రూపుదిద్దుకున్నది.

 

అనేక ప్రదర్శనలు, ప్రశంసలు

 చిన్నతనం నుంచే కూచిపూడి నృత్యంలో శిక్షణ పొందుతున్న అంబిక శ్రీ తాను చదివే పాఠశాలలోను, అనంత రం కళాశాలలోను అనేక ప్రదర్శనలు ఇచ్చింది. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుని అధికారిక నివాసం వైట్‌హౌస్‌లో నృత్యా న్ని ప్రదర్శించే అవకాశం అమెకు కలి గింది.ఎంతోమంది అమెరికా, ప్రవాస భారతీయ ప్రముఖుల సమక్షంలో ఆమె తన నృత్యప్రదర్శనతో వారి ప్రశంసలు అం దుకుంది.అదేవిధంగా అతి చిన్నవయసులో తన నృత్యానికి గాను 2008లో కాలిఫోర్నియాలో, 2012లో హైదరాబాదులో జరిగిన ప్రదర్శనల్లో ఆమె గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్‌లో స్థానం సంపాదించింది.ఇక వివిధ సందర్భాల్లో అమెరికా పర్యటనకు వెళ్లిన తెలుగు కళారంగ, సినీరంగ ప్రముఖుల సమక్షంలో ఆమె తన ప్రదర్శనతో వారి నుంచి ప్రశంసలు పొందింది.ప్రముఖ సినీ గాయనిలు పి.సుశీల, చిత్ర వంటి వారు ఆమె ప్రదర్శనకు ముగ్థులై ఆమెను సత్కరించారు.ఇప్పటి వరకు దాదాపు 200 ప్రదర్శనలు ఇచ్చిన అంబిక శ్రీ, తన మాతృగడ్డ అయిన ఒంగోలులో సైతం ఇటీవలే అద్భుతమైన కూచిపూడి నృత్యప్రదర్శన ఇచ్చి పురప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకుంది. 

 

చదువులోనూ ముందంజ

కూచిపూడి నృత్యంలోనే కాక చదువులోను అంబిక శ్రీ ముందంజలో ఉంది. ప్రస్తుతం అక్కడి ప్లస్‌ 2 చదువుపూర్తి చేసి మరో నెలరోజుల్లో మెడిసిన్‌ కోర్సులో చేరబోతున్నది అంబిక శ్రీ.ఆమె మేరీలాండ్‌లోని రివర్‌ హిల్‌ హైస్కూల్‌లో తన విద్యాభ్యాసం చేసింది.ఆ సమయంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘హార్వర్డ్‌ కౌంటీ బోర్డు’కు 2018-19 సంవత్సరానికిగాను స్టూడెంట్‌ మెంబర్‌గా ఎన్నికై దాదాపు 60 వేలమంది విద్యార్థులకు ప్రాతినిధ్యం వహించింది. 

 

కళలకు గౌరవం, ప్రోత్సాహం ఎక్కువ
అమెరికాలో మన భారతీయ కళలను, కళాకారులను బాగా గౌరవిస్తారు. అదేవిధంగా అక్కడివారు వీటిని బాగా ప్రోత్సహిస్తారు.ఎక్కడైన కళాసంబంధమైన కార్యక్రమం ఏర్పాటైతే స్వచ్ఛందంగా వందలాదిమంది హాజరై చివరి వరకు వీక్షించి అభినందిస్తారు.ఇక నేను కూచిపూడి నృ త్యంలో ప్రవేశించటానికి రాణించటానికి నా తల్లిదండ్రు లతో పాటు నా తాతగారైన వాణీప్రసాద రావు, మా అమ్మ మ్మ, నానమ్మ, తాతయ్యల ప్రోత్సాహం కూడా ఎంతో ఉం ది. నృత్యంలో నేను నేర్చుకోవాల్సింది ఇంకా ఎంతో ఉంది అనుకుంటున్నాను. నేను మెడిసిన్‌లో చేరినప్పటికీ కూచి పూడి నృత్య సాధన విడిచిపెట్టకుండా మంచి నృత్యకళాకా రిణిగా రూపొంది నా కుటుంబ సభ్యులకు నా జన్మభూమి అయిన ఒంగోలుకు పేరు తేవాలని నా ఆకాంక్ష.
- శిద్దాబత్తుల అంబిక శ్రీ