Indian-cubic-master-is-once-a-pubg-addict

పబ్జీ పిచ్చోడు.. తండ్రి బహుమతితో.. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు.. గిన్నిస్‌పై గురి..

పబ్జీ గేమ్‌కు అలవాటు పడిన తమ అబ్బాయి ఏమైపోతాడో అని తల్లితండ్రులు ఆందోళన చెందారు. ఆ ఆట నుంచి అతడి దృష్టి మరల్చేందుకు రూబిక్‌ క్యూబ్‌ కొనిచ్చారు. ఇప్పుడా కుర్రాడు దాంతో రికార్డులు సృష్టిస్తున్నాడు. ముంబయ్‌కి చెందిన 14 ఏళ్ల అఫన్‌ కుట్టీ కబుర్లివి..

 

ముంబై:ఒక రూబిక్‌ క్యూబ్‌ సెట్‌ చేయాలంటే గంటలు కూర్చున్నా మనకు సాధ్యం కాదు. కానీ అఫన్‌ కుట్టీ మాత్రం మూడు నిమిషాల్లో 12 క్యూబ్‌లను పరిష్కరిస్తాడు. అంతేకాదు కళ్లకు గంతలు కట్టుకుని మరీ క్యూబ్‌ను సెట్‌ చేస్తాడు. 3గీ3, 7గీ7, 13గీ13 క్యూబ్‌ ఏదైనా అఫన్‌ చేతుల్లోకి తీసుకుంటే క్షణాల్లో సెట్‌ అయిపోతుంది. కొద్ది రోజుల క్రితం కళ్లకు గంతలు కట్టుకుని క్యూబ్‌లో 26 ఇంగ్లీష్‌ పదాలను వరుస క్రమంలో అమర్చి లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డులోకెక్కాడు. ఎనిమిదో తరగతి చదువుతున్న ఈ కుర్రాడికి సెల్‌ఫోన్‌లో టిక్‌టాక్‌ వీడియోలు చేయడం, పబ్జీ గేమ్‌ ఆడే అలవాటు ఉండేది. ఆ అలవాటును మాన్పించడానికి ఆఫన్‌ తండ్రి బైజు ఒక రూబిక్‌ క్యూబ్‌ కొనిచ్చాడు. ‘నేను 500కు పైగా టిక్‌టాక్‌ వీడియోలు చేశాను. ఎప్పుడూ నా మైండ్‌లో పబ్జి గేమ్‌ ఉండేది. దానివల్ల ఆరోగ్యం దెబ్బతింది. ఎలాగైనా ఆ అలవాటు నుంచి బయటపడాలనుకున్నాను. ఆ సమయంలోనే మా నాన్న క్యూబ్‌ కొనిచ్చాడు. యూట్యూబ్‌లో చూసి క్యూబ్స్‌ ఎలా పరిష్కరించాలో నేర్చుకున్నాను’’ అంటాడు అఫన్‌. ‘కళ్లకు గంతలు కట్టుకుని అక్షరాలు ఎలా క్రమంలో పెట్టగలుగుతున్నావు’అని అడిగితే ‘‘ప్యాటర్న్‌ ఫాల్‌ అవుతాను’’ అని కూల్‌గా చెబుతాడు. లాస్‌ ఏంజిల్స్‌లో జరిగే ఇంటర్నేషనల్‌ క్యూబింగ్‌ ఈవెంట్స్‌లో పాల్గొనాలని, గిన్నిస్‌ రికార్డ్సులోనూ చోటు సంపాదించాలని అనుకుంటున్నాడు అఫన్‌.