స్టూడెంట్‌ వీసా ఉన్నవారు ఉద్యోగం చేయొచ్చా..

యూఎస్‌ నిబంధనల ప్రకారం స్టూడెంట్‌ వీసా ఉన్న వారు పార్ట్‌ టైమ్‌గా కానీ, పూర్తి స్థాయిలో కానీ ఉద్యోగం చేయడానికి అనర్హులు. ఈ నిబంధనను ఎవరైనా ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. అయితే విదేశీ విద్యార్థులకు ఆర్థికంగా కొంత మేలు చేయడానికి వారంలో గరిష్టంగా 20 గంటలు పార్ట్‌టైమ్‌ ఉద్యోగం చేసుకోవచ్చని ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. అయితే యూనివర్శిటీ క్యాంపస్‌లో మాత్రమే పార్ట్‌టైమ్‌ ఉద్యోగం చేయాలని నిబంధన విధించింది. యూనివర్శిటీకి వేసవి సెలవుదినాల్లో పూర్తి స్థాయలో ఉద్యోగం చేసుకోవచ్చని తెలిపింది.

యూనివర్శిటీ క్యాంపస్‌లో సరియైున కారణాలు ఉంటేనే పార్ట్‌టైమ్‌ జాబ్‌ చేయడానికి అంగీకరిస్తారు. అదికూడా విద్యార్థి  కోర్సుకు ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌గా ఉపయోగపడేదిగా ఉంటేనే ఓప్పుకుంటారు. విదేశీ విద్యార్థులు యూనివర్శిటీ అంగీకారం లేకుండా బయట పనిచేయడం అమెరికాలో చట్టరీత్యా నేరం. యూనివర్శిటీలో నెట్‌వర్కింగ్‌, టెక్నికల్‌ అసిస్టెంట్‌, రీసెర్చ్‌ అసిస్టెంట్‌, లైబ్రరీ అసిస్టెంట్‌, యూనివర్శిటీ రెస్టారెంట్స్‌, జూనియర్‌ స్టూడెంట్స్‌కి ట్యూషన్లు చెప్పడం వంటి  వాటిల్లో పార్ట్‌టైమ్‌ జాబ్స్‌  యూనివర్శిటీల్లో చేయవచ్చు.  కొంతమంది విద్యార్థులు రెజ్యూమ్స్‌ ప్రిపేర్‌ చేస్తూ కూడా కొద్దిపాటి మొత్తాన్ని సంపాదిస్తుంటారు.