ఏ పాస్‌పోర్టు ఎవరికి...?

భారత ప్రభుత్వం వ్యక్తిని బట్టి పాస్‌పోర్టు జారీ చేస్తుంది. ఆర్డినరీ, డిప్లమాటిక్‌, అఫిషియల్‌ పాస్‌పోర్టు పేర్లతో మొత్తం మూడు రకాల పాస్‌పోర్టు సర్వీసులను భారత ప్రభుత్వం కల్పిస్తోంది. అయితే ఒక్కో పాస్‌పోర్టుకు ఒక్కో విశిష్టత ఉంది.  ఏ రకమైన పాస్‌పోర్టుకు ఎవరెవరు అర్హులో తెలుసుకుందామా...

 
1. ఆర్డినరీ పాస్‌పోర్టు: 

ఈ రకం పాస్‌పోర్టులపై బ్లూ కవర్‌ ఉంటుంది. వీటిలో రకాన్ని బట్టి 36గానీ, 60 గానీ పేజీలు ఉంటాయి. ఈ పాస్‌పోర్టులకు కనీసం పది సంవత్సరాల గడువు ఉంటుంది. గడువు పూర్తయినా ఇంకా ఉండాల్సి వస్తే రెన్యూవల్‌గానీ, కొత్తగాగానీ పాస్‌పోర్టుకు దరఖాస్తు చేసుకోవాలి. ఓ సాధారణ భారతీయులు ఈ రకమైన పాస్‌పోర్టులను వాడుతుంటారు.

2.డిప్లమాటిక్‌ పాస్‌పోర్టు:

వీటిపై కవర్లు మరూన్‌ కలర్లో ఉంటాయి. ఈ రకం పాస్‌పోర్టులు ఉన్న భారతీయులను విదేశాల్లో ప్రత్యేకంగా గౌరవిస్తుంటారు. వారిపట్ల గౌరవ మర్యాదలు పాటిస్తుంటారు. కేంద్ర ప్రభుత్వ, న్యాయ విభాగ, దౌత్యవేత్తలు వంటి వారికి ఈ రకమైన పాస్‌పోర్టులను ఇస్తారు. లేదా ప్రత్యేక మైన వ్యక్తిగా కేంద్ర ప్రభుత్వం సిఫారసు చేసిన వారికి ఈ పాస్‌పోర్టు సౌకర్యాన్ని అందిస్తారు.

3. అఫిషియల్‌ పాస్‌పోర్టు:
వీటి కవర్లు గ్రే రంగులో ఉంటాయి. వీటిని నాన్‌ గెజిటెడ్‌ ప్రభుత్వోద్యోగులు, విదేశాలకు ప్రభుత్వ పనిపై వెళ్లే వ్యక్తులు, ప్రభుత్వం సిఫారసు చేసిన వారికి ఈ రకమైన పాస్‌పోర్టును ఇస్తారు. ప్రభుత్వానికి సంబంధించిన వ్యాపార పనిపై వెళ్లే వారకి కూడా ఈ రకమైన పాస్‌పోర్టును ఇస్తారు.