భారత్‌లో ఉన్న ఎన్నారై అస్తులకు వెల్త్‌ ట్యాక్స్‌ కట్టాలా?

భారత్‌లో ఇళ్లు, కమర్షియల్‌ కాంప్లెక్సులు వంటి స్థిరాస్తులు కలిగి ఉన్న ఎన్నారైలు భారత ప్రభుత్వానికి వెల్త్‌ ట్యాక్స్‌ కట్టాలా? అనే విషయంలో చాలా మంది ఎన్నారైలు గందరగోళానికి గురవుతుంటారు. ఇంతకుముందు అంటే 2015 ఫిబ్రవరికి ముందు భారత్‌లో 30 లక్షల రూపాయలకు మించిన ఆస్తి కలిగి ఉన్న ఎన్నారైలు ఒక శాతం వెల్త్‌ ట్యాక్స్‌ కట్టాల్సి ఉండేది. అయితే ఇప్పుడు ఎన్నారైలకు భారత్‌లో ఎంత ఆస్తి ఉన్నా.. వారు ప్రభుత్వానికి ఎలాంటి వెల్త్‌ ట్యాక్స్‌ కట్టాల్సిన అవసరం లేదు. 2015 ఫిబ్రవరి 28న జరిగిన బడ్జెట్‌ సమావేశంలో ఈ సంవత్సరం నుంచి హెల్త్‌ ట్యాక్స్‌ను పూర్తిగా తొలగిస్తున్నామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ ప్రకటించారు. 2015-16 ఆర్థిక సంవత్సరం నుంచి వెల్త్‌ ట్యాక్స్‌ రద్దు అమల్లోకి వస్తుందని ఆయన తెలిపారు.