వారసత్వపు హక్కు ఎన్నారైలకు ఉంటుందా?

ఎన్నారైలకు వారసత్వ హక్కు ఉంటుందా? ఉండదా? అనే విషయంలో చాలా మంది గందరగోళానికి గురవుతుంటారు. అలాగే భారత్‌లో నివసిస్తున్న వారు కూడా ఎన్నారైలకు వారసత్వ హక్కు ఇవ్వడానికి నిరాకరిస్తుంటారు. అయితే ఎన్నో ఏళ్ల కిత్రం భారత్‌ నుంచి వెళ్లిపోయి.. ఒక్కసారి కూడా ఇండియాకు రాని వారైనా సరే లీగ్‌ల్‌గా ఇక్కడి ఆస్తికి వారసులే.

 వారసత్వంగా సంక్రమించిన రెసిడెన్సియల్‌ ల్యాండ్‌, కమర్షియల్‌ ల్యాండ్‌ మాత్రమే కాకుండా అగ్రికల్చర్‌ ల్యాండ్‌ మీద కూడా వారికి హక్కు ఉంటుంది. అలాగే అవి వారికి బహుమతిగా వచ్చినా కూడా వారు లీగల్‌గా వాటికి వారసులే. కాగా, ప్రస్తుతం భారత్‌లో ఇన్‌హరిటెన్స్‌ (వారసత్వ) టాక్స్‌ విధానం అమల్లో లేదు. నిజానికి భారత సంతతికి చెందిన వారే కాకుండా విదేశీయులకు కూడా వారసత్వ హక్కు ఉంటుంది. ప్రపంచంలోని చాలా దేశాలకు చెందిన పౌరులు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) అనుమతి లేకుండానే వారసత్వ హక్కు పొందవచ్చు. అయితే పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంక, అఫ్గానిస్తాన్‌, చైనా, ఇరాన్‌, నేపాల్‌, బూటాన్‌లకు చెందిన పౌరులకు మాత్రం ఆర్బీఐ ఆదేశాల మేరకే వారసత్వ హక్కు లభిస్తుంది.