యూఎస్‌ ప్రభుత్వం అంతర్జాతీయ విద్యార్థులకు ఆర్థిక సాయం చేస్తుందా?

 విద్యార్థులకు యూఎస్‌ ప్రభుత్వం రెండు ప్రాతిపదికలపై విద్యార్థులకు ఆర్థిక సాయం అందిస్తుంది. పేద విద్యార్థులతో పాటు మెరిట్‌ స్టూడెంట్స్‌కు కూడా ప్రభుత్వం సాయం చేస్తోంది. తల్లిదండ్రుల ఆదాయం ద్వారా పేద విద్యార్థులకు, విద్యా సంవత్సరంలో వచ్చే గ్రేడ్స్‌ ప్రకారం మెరిట్‌ విద్యార్థులకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుంది. క్రీడాకారులకు కూడా మెరిట్‌ పద్ధతిన సాయం చేస్తుంది. అయితే ఈ ఆర్థిక సాయం కేవలం యూఎస్‌ విద్యార్థులకు మాత్రమే. అంతర్జాతీయ విద్యార్థులకు యూఎస్‌ ప్రభుత్వం ఆర్థిక సాయం చేయదు. అయితే యూఎస్‌లోని చాలా యూనివర్శిటీలు విద్యార్థులకు సాయం అందించడానికి ప్రత్యేకమైన పద్దతిని అనుసరిస్తున్నాయి. పేద విద్యార్థులకు, మెరిట్‌ విద్యార్థులకు ఆర్థిక సాయం చేయడానికి అంతర్జాతీయ యూనివర్శిటీలు ముందుకొస్తున్నాయి. అమ్హెరెస్ట్‌, యేలే, ప్రిన్స్‌స్టన్‌, ఎమ్‌ఐటీ, హార్వార్డ్‌ వంటి యూనివర్శిటీలయితే విద్యార్థుల ఆర్థిక స్తోమతను చూడకుండానే చేర్చుకుంటాయి. ఆ తర్వాత విద్యార్థులకు ఏ మేరకు అవసరముందో చూసుకుని ఆర్థిక సాయం చేస్తుంటాయి. జాతీయ అంతర్జాతీయ విద్యార్థులకు యూనివర్శిటీలు ఏ విధంగా సాయం చేస్తున్నాయో ఆయా వర్శిటీల వెబ్‌సైట్లలో చూసుకోవచ్చు.