విదేశీ విద్య.. కారాదు మిథ్య

విదేశాల్లో చదువుకు ఆచితూచి అడుగు వేయాలి 

వర్సిటీల గ్రేడింగ్‌, చరిత్ర తెలుసుకుని చేరాలి 
అనామక వర్సిటీల్లో చేరడం వల్ల ప్రయోజనం కల్ల 
ఏజెన్సీల మోసాలను గుర్తెరిగి నడుచుకోవాలి 
 
 
విదేశాల్లో చదవాలని ఆశపడని వారెవరుం టారు...అదీ అమెరికా వంటి అగ్రరాజ్యంలోని యూనివర్సిటీలో చదువంటే ఎగిరి గంతేస్తారు. కానీ ఇటీవల కాలంలో పాశ్యాత్య దేశాల్లో ప్రధా నంగా అమెరికాలో విదేశీ విద్యార్థులపై పెరుగు తున్న నిఘా నేపథ్యంలో ఆచితూచి అడుగు వేయాలని సూచిస్తున్నారు నిపుణులు. కొన్నాళ్ల క్రితం అమెరికాలోని రెండు యూనివర్సిటీల్లో ప్రవేశంపొందిన విద్యార్థులను వెనక్కి పంపే శా రు.వీరిలో తెలుగు వారు కూడా ఉన్నారు. ఇలాం టి వ్యవహారాల్లో తప్పెవరిదైనా నష్టపోయేది మాత్రం విద్యార్థులే. అందువల్ల ఆచీ తూచి అడుగు వేయాలని సూచిస్తున్నారు నిపుణులు.
 
వర్సిటీలు కావు...కళాశాలలు 
విదేశాల్లోని కళాశాలలు, వర్సిటీలన్నీ మన దేశంలోని వాటి కంటే గొప్పవి కావు. ఉదాహర ణకు అమెరికాలోవన్నీ యూనివర్సిటీలు కావు. మన దేశంలో కళాశాలలుగా పిలిచే విద్యా సంస్థలను అక్కడ వర్సిటీలంటారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో వందల సంఖ్యలో యూని వర్సిటీలున్నాయి. వీధి చివరన ఓ భవనంలో నిర్వహించే వర్సిటీలుంటాయంటే ఆశ్చర్యం కలుగుతుంది. మన విద్యార్థులను వెనక్కి పం పిన రెండు వర్సిటీలు అంతగా పేరుప్రఖ్యా తుల్లేని ఇటువంటివే. ఎన్నో విదేశాల్లోని వర్సిటీల పరిస్థితి ఇదే. కేవలం ఇంటర్నెట్‌ ద్వారా కోర్సులు అందించే వర్సిటీలు పదుల సంఖ్యలో ఉంటా యి. వీటిని వర్చువల్‌ వర్సిటీలంటారు. అందు వల్ల విదేశాల్లో చదువు కోరుకునే విద్యార్థులు ఆయా వర్సిటీల స్థాయి, చరిత్ర, ఫ్యాకల్టీ వివ రాలు, గ్రేడింగ్‌ వంటి విషయాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. ఇందుకు ఆయా దేశాల్లో స్థిరపడిన వారి ద్వారా వాకాబు చేయడం మంచిది. విదేశాలకు వెళ్తు న్నామన్న మోజులో కేవలం ఏజెన్సీలను నమ్మి నిర్ణయాలు తీసు కుంటే మోసపోవ డం మన వంతవు తుంది. కమిషన కో సం పనిచేసే ఏజెన్సీలు చివరి వరకు మన బాధ్యత తీసుకోవని గుర్తుంచుకోవాలి. అమెరికా వంటి దేశంలో చదువుకు మంచి అవకాశాలు ఉన్నా గోల్డ్‌ పక్కన రోల్డ్‌గోల్డ్‌ ఉన్నట్లే అనామక వర్సిటీల గురించి తెలుసుకోవడం మన బాధ్యత. ‘ప్రతిభకు పట్టంకట్టే దేశాల్లో అమెరి కాదే మొదటి స్థానం. కాకపోతే ఎంచుకున్న వర్సిటీ మన తెలివితేటలపై ఆధారపడి ఉం టుంది’... ఏయూ కంప్యూటర్స్‌ ఇంజనీరింగ్‌ విభాగాధిపతి పి.వి.జి.డి.ప్రసాదరెడ్డి చెబుతున్న ఈ మాటలు అక్షర సత్యాలు.
 
విదేశాలకు వెళ్లేవారు ఏం చేయాలి 
తాము చేరే వర్సిటీకి గ్రేడింగ్‌ ఉందా? చరిత్ర ఏమిటి? ప్రభుత్వమా? ప్రైవేటా? ప్రైవేటు నిర్వాహకుల స్థితి ఏమిటి? తెలుసుకోవాలి. 
అమెరికాలో తొలుత చిన్నవర్సిటీలోచేరి అనం తరం మంచి వర్సిటీకి బదిలీ అయ్యే అవ కాశం ఉండేది. అప్పుడు అమెరికా చదువుకు ఇదో మార్గం అనుకునేవారు. ఇప్పుడా ఆప్షన్ లేదు. ఎక్కడ చేరితే అక్కడే కొనసాగాలి. విదేశాలకు విద్యార్థులను పంపే ఏజెన్సీల విషయంలో తల్లిదండ్రులు, విద్యార్థులు జాగ రూకతతో వ్యవహరించాలి. కమిషన పరమా వధిగా భావించే ఏజెన్సీలను దూం పెట్టాలి. అమెరికా వంటి దేశంలో ప్రతిభకే పట్టం కడతారు. మెరిట్‌ ఉంటే మంచి యూనివర్సి టీలో సీటు దక్కించుకోవచ్చు. సాధారణ విద్యార్థులైతే కష్టమే. అటువంటి వారు ఒకటికి పదిసార్లు ఆలోచించాలి. వెళ్లాల్సిన దేశంలోని పరిస్థితులు, విదేశీయుల పట్ల అక్కడి ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు, ఆంక్షలపై పూర్తి అవగాహన ఉండాలి. 
 

మోజుతోపాటు వాస్తవాలు తెలుసుకోవాలి 
విదేశాల్లో చదువుకోవాలన్న మోజు మంచిదే. కానీ అక్కడికి వెళ్తున్నప్పుడు అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. అన్ని వివరాలపై పూర్తి అవగాహన ఏర్పర్చుకున్నాకే అడుగు ముందుకు వేయాలి. అప్పులు చేసి విదేశాల్లో చదువుకునేందుకు వెళ్లిన తర్వాత జరగరాని మోసం జరిగితే కుటుంబ మే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మంచి వర్సిటీలైతేనే భవిష్యత్తులో ఉపాధి లభిస్తుంది. అనామక వర్సిటీలను ఏ సంస్థ పరిగణనలోకి తీసుకోదు. అందువల్ల చేరే యూనివర్సిటీ గురించి ఒకటికి రెండుసార్లు చెక్‌ చేసుకుని నిర్ణయం తీసుకోవాలి. 
- ఆచార్య పి.వి.జి.డి.ప్రసాదరెడ్డి, హెచ్ఓడీ, కంప్యూటర్‌ సైన్స విభాగం, ఏయూ