అమెరికాలో ఈ 19 రాష్ట్రాలు వెరీ స్పెషల్

వాషింగ్టన్: పశ్చాత్తాపానికి మించిన ప్రాయచ్చిత్తం లేదు.. ఇది పెద్దలు చెప్పిన మాట.  ‘వీలైతే ప్రేమించండి డ్యూడ్.. పోయేదేముంది.. మహా అయితే తిరిగి ప్రేమిస్తారు..’ ఇది నేటి తరం చెబుతోన్న డైలాగ్. మొత్తానికి క్షమించేయడం అనేది గొప్ప పని అని పెద్దలు చెప్పకనే చెప్పారు. అందుకే ఎంత పెద్ద నేరం చేసినా కొన్ని దేశాలు కఠిన శిక్ష విధించడానికే మొగ్గు చూపుతాయి కానీ.. ఉరిశిక్ష మాత్రం వేయవు. ఇప్పటివరకూ ప్రపంచంలో చాలా దేశాలు ఉరిశిక్షను రద్దు చేసుకున్నాయి. ఆ మార్గంలోనే అమెరికాలోని 19 రాష్ట్రాలు తమ పౌరులపై ప్రేమను చూపుతూ ఉరిశిక్ష లేకుండా చట్టం చేసుకున్నాయి. ఆ రాష్ట్రాలేవో ఓ లుక్కేయండి మరి. 

న్యూమెక్సికో, నార్త్ డకోటా, నెబ్రస్కా, మిన్నెసోటా, ఐవా, విస్కోన్సిన్, ఇల్లినాయిస్, మిచిగాన్, వెస్ట్ వర్జీనియా, న్యూయార్క్, వెర్రమాంట్, మైనే, మస్సాచుసెట్స్, రాథోడ్ ఐస్‌లాండ్, కన్నెక్టికట్, న్యూజెర్సీ, మేరిలాండ్, అలస్కా, హవాయ్. 
 
ఈ 19 రాష్ట్రాలు మరణశిక్షను రద్దు చేసుకున్నాయి. అమెరికాలోని మొత్తం 50 రాష్ట్రాలు ఉన్నా కేవలం ఈ రాష్ట్రాలు మాత్రమే ఇలా రద్దు చేయడం గమనార్హం.