భారతీయ పౌరసత్వం పొందడం ఎలా..

 విదేశాల్లో స్థిరపడిన ఎన్నారైలు భారతదేశ పౌరసత్వం పొందాలనుకుంటుంటారు. అయితే పీఐవో, ఓసీఐ వంటి కార్డుల ద్వారా ఎటువంటి వ్యతిరేకత లేకుండా ఎన్నిసార్లయినా భారత్‌ సందర్శనకు రావచ్చు. అయితే అవేమీ పౌరసత్వాన్ని ధృవీకరించే కార్డులు కావు. ఎన్నారైలు భారతీయ పౌరసత్వాన్ని పొందాలంటే ఖచ్చితంగా వారు ఇతర ఏ దేశాల పౌరసత్వాన్ని కలిగి ఉండటానికి వీల్లేదు. భారత పౌరసత్వం పొందడానికి కొన్ని అర్హతలు ఉన్నాయి. ఏ దేశం వారయినా భారతదేశ పౌరసత్వాన్ని పొందడానికి కుదరదు. కేవలం భారతదేశ మూలాలున్న వారే ఈ పౌరసత్వానికి అర్హులు..

పౌరసత్వాన్ని పొందడానికి ఈ క్రింది వారు అర్హులు
 
1. . 1950వ సంవత్సరం జనవరి 26 తేదీలోపు భారత్‌లో జన్మించిన వారు, 1987 సంవత్సరం తర్వాత అభ్యర్థి పుట్టిన సమయానికి తల్లిదండ్రులకు భారతీయ పౌరసత్వం కలిగి ఉండాలి.
2. 2004వ సంవత్సరం జనవరి 7తేదీ తర్వాత పుట్టిన వారి తల్లిదండ్రులిద్దరికీ గానీ, ఒకరికి గానీ భారతీయ పౌరసత్వం కలిగి ఉండాలి. దంపతుల్లో మరొకరు అక్రమంగా భారతదేశంలో ఉన్న వారై ఉండకూడదు. 
3. వరుసగా ఏడు సంవత్సరాల నుంచి భారతదేశంలో నివసిస్తున్నవారై ఉండాలి.
4. భారతదేశ పౌరులై ఉండి విదేశాల్లో తాత్కాలిక నివాసముంటున్నవారు.
5. భారత పౌరసత్వం కలిగిన వారిని పెళ్లి చేసుకుని వరుసగా అయిదు సంవత్సరాల నుంచి ఇండియాలోనే ఉంటున్నవారు.
6. ఇండియాలో నివసిస్తున్న సింగపూర్‌ వాసికి అయిదు సంవత్సరాలు, కెనడా వాసికి ఎనిమిది సంవత్సరాల్లో భారత పౌరసత్వం ఇస్తారు. 
7. భారత్‌లో 12 సంవత్సరాలుగా తాత్కాలిక నివాసం ఉంటున్న విదేశీయులకు కూడా పౌరసత్వం ఇస్తారు. 
8. ఓసీఐ కార్డులు కలిగిఉన్నవారు భారతీయ పౌరసత్వం కోసం దరఖాస్తు చేసే సమయానికి సంవత్సరం ముందు నుంచి ఇండియాలో నివసిస్తున్నవారై ఉండాలి.
8. భారతీయ పౌరసత్వాన్ని పొందాలనుకుంటున్న విదేశీయులు వారి పూర్వ స్వదేశపు పౌరసత్వం కొల్పోవాల్సిందే.