ఎన్నారై మహిళను కదిలించిన ఆంధ్రజ్యోతి రచన

రచనలు వినోదాన్ని, వివేకాన్ని కలిగించడమే కాదు విప్లవాత్మక నిర్ణయాలకు సోపానాలుగా నిలుస్తాయి. అలాంటి సంఘటనే ఒకటి జరిగింది. ఆంధ్రజ్యోతి అనుబంధ వారపత్రిక ‘నవ్య’లో వచ్చిన ఓ రచనను చూసిన ఎన్నారై మహిళలో అంతర్మథనం మొదలైంది. అది చివరకు ఆమె తన కుటుంబంతో సహా స్వదేశానికి పయనమయ్యేలా చేసింది. విదేశీ మోజులోపడి ఏం కోల్పోతున్నారో తనకు అర్థం అయిందంటూ తన కుటుంబంతో సహా స్వస్థలానికి బయలుదేరిందామె. ఆగస్టులో వచ్చిన నవ్య వారపత్రికలోని కథనం చూసిన తర్వాత ఆంధ్రజ్యోతికి ఆమె లేఖ రాసింది. తన భావాలను ఆ ఉత్తరంలో బయటపెట్టింది. ఆ ఉత్తరాన్ని యథాతథంగా మీ ముందుంచుతున్నాం...
 
‘‘నేను నవ్యవీక్లీ అభిమానిని. అందునా మొదటి పేజీ అంటే మరీ మరీ అభిమానం. ఆగస్టు 17 ఇష్యూలో వచ్చిన మొదటిపేజీ ‘చిట్కా’లోని జానకీ రావు పాత్ర నన్నెంతగానో కదిలించింది. ఒక్కసారిగా నన్ను నా మాతృదేశంవైపు చూసేలా చేసింది. అప్పుడు ఆలోచించాను అసలు నేను భారత దేశాన్ని వదిలి అమెరికాకు ఎందుకు వచ్చినట్టు అని. చిట్కా చదివిన తరువాతనే అర్థమైంది ఆస్తులు, అంతస్తులు లేకపోయినా సొంతగడ్డపై స్వేచ్ఛగా జీవించవచ్చు. కానీ పరాయి దేశంలో ఎన్ని ఉన్నా ఏదో ఇనసెక్యూరిటీ ఫీలింగ్‌ ఉంటుందని. ‘బంధాలు, బంధుత్వాలన్నీ సొంతగడ్డమీద అక్కడే ఉంటే, ఏ బంధాలు లేకుండా ఇక్కడ నేను సంతోషంగా ఎలా ఉండగలను?’ అనిపించింది. ఎందుకని అందరూ విదేశాలవైపు మొగ్గుచూపు తున్నారు? వెలుగులోంచి చీకటిలోకి, స్వేచ్ఛాప్రపంచం నుంచి నాలుగ్గోడల మధ్యకి ఎందుకు పరిగెడు తున్నారు? అనే ప్రశ్నలు ఒకదాని తరువాత మరొ కటి నాలో ఉదయించాయి. 
 
నిజంగా మొదటిపేజీ చిట్కా, నా జీవితంలో ఓ పాజిటివ్‌ మార్పు వచ్చేలా చేసింది. నన్ను నా కూతురితో సహా మాతృభూమికి పయనమయ్యేలా చేసింది. నాకు నా మాతృదేశంపై మమకారం కలి గించి, నాకు సరైన దారి చూపించిన ఎడిటర్‌ గారికి కృతజ్ఞతలు. నాలాంటి ఎంతోమంది తల్లులు కూడా మీ మొదటిపేజీ చదివి సరైన దారి ఎంచుకుంటారని ఆశిస్తున్నా. ముందు ముందు మీ రచనలు కూడా ఇలా ఎంతోమందికి దారి చూపించాలని కోరుకుంటున్నాను. 
-నాగలక్ష్మి, యుఎస్‌ఏ’’

ఆమెపై.. ఆమె కుటుంబంపై ప్రభావితం చూపిన ‘ఆంధ్రజ్యోతి-నవ్య’ రచన ఇదే...