పాస్‌పోర్ట్ ఉంటే చాలు.. 59 దేశాల్లో మనదే రాజ్యం

న్యూఢిల్లీ: వీసా.. ఏదైనా దేశానికి వెళ్లాలంటే ముందుగా తీసుకునే పర్మిషన్ లెటర్ వంటిది. తమ దేశంలోకి ఎప్పుడు రావాలి, ఎప్పుడు వెళ్లాలి, ఏ పని నిమిత్తం వస్తున్నారు.. వంటి వాటిని పేర్కొంటూ విదేశీయులకు ఆయా దేశాలు వీసాను మంజూరు చేస్తాయి. టూరిస్ట్ వీసా, ఎడ్యుకేషన్, వర్క్, బిజినెస్ వంటి ఎన్నో రకాల వీసా సదుపాయాలను చాలా దేశాలు కల్పిస్తున్నాయి. అయితే వాణిజ్య సంబంధాలను పెంచుకోవడానికి కొన్ని దేశాలు వినూత్న విధానాలను అనుసరిస్తున్నాయి. వ్యాపార సంబంధాలను పెంచుకోవడం కోసం వీసా లేకుండా విదేశీయులను తమ గడ్డపైకి రానిచ్చేందుకు ఆయా దేశాలు అనుమతినిస్తున్నాయి. మన భారత దేశానికి ఉన్న ప్రతిష్ఠను చూసేకాకుండా, భారత్‌తో ఉన్న అవసరం దృష్ట్యా కొన్ని దేశాలు స్నేహహస్తం చాటాయి. దీంట్లో భాగంగా భారతీయులను వీసా లేకుండా తమ దేశంలోకి రానిచ్చేందుకు 59 దేశాలు అంగీకరించాయి. వీసా అవసరం లేకుండా కొన్ని దేశాలు, అక్కడకు వెళ్లాక వీసా ఇచ్చేలా మరికొన్ని దేశాలు భారతీయులను తమ దేశంలోకి రానిస్తున్నాయి. కొన్ని దేశాలు పాస్‌పోర్ట్, మరి కొన్ని దేశాలు ఏదైనా గుర్తింపు కార్డు ఉంటే చాలంటున్నాయి.  ఇది పర్యాటకంగా ఆయా దేశాలకు ఎంతో ఉపయోగకరంగా ఉండటమే కాకుండా భారత్‌తో స్నేహం కూడా పెరుగుతోంది. మరి ఆ 59 దేశాలేవో ఓ లుక్కేయండి... వీలుంటే ఏ విహారయాత్రకో ప్లాన్ చేసుకోండి..

 
1.Jamaica – No Visa
2 Jordan – Visa on Arrival
3.Montserrat - No Visa
4. Laos – Visa on Arrival
5. Bahrain – eVisa
6. Bhutan – No Visa
7. Dominica – No Visa
8. Eucador - No Visa
9. El Salvador - No Visa
10. Ethiopia - Visa on Arrival
11. Bolivia – Visa on Arrival
12. Cambodia – Visa on Arrival
13. Cape Verde - Visa on Arrival
14. Comoros -Visa on Arrival
15. Cote d’Ivoire – eVisa
16. Djibouti - Visa on Arrival
17. Cote d’Ivoire – eVisa
18. Djibouti - Visa on Arrival
19. Mauritius – No Visa
20.  Micronesia – No Visa
21. Moldova – eVisa
22. Myanmar – eVisa
23. Nepal – No Visa
24. Fiji - No Visa
25. Gabon – eVisa
26. Georgia – eVisa
27. Grenada – No Visa
28. Guinea-Bissau – Visa on Arrival
29. Guyana – Visa on Arrival
30. Haiti – No Visa
31. Indonesia – Visa on Arrival
32. Seychelles – Visa on Arrival
33. Somalia – Visa on Arrival
34. Sri Lanka – No Visa but special permit required
35.  Tanzania - Visa on Arrival
36. Thailand - Visa on Arrival
37. Togo - Visa on Arrival
38. Madagascar – Visa on Arrival
39. Maldives – Visa on Arrival
40.  Mauritania – Visa on Arrival
41. Palau – Visa on Arrival
42. Rwanda – eVisa
43. Saint Kitts and Nevis – No Visa
44. Saint Lucia – Visa on Arrival
45. Saint Vincent and the Grenadines – No Visa
46. Trinidad and Tobago – No Visa
47. Kenya – eVisa
48. Uganda – Visa on Arrival
49. Vanuatu – No Visa
50. Samoa – Permit on Arrival
51. São Tomé and Príncipe – eVisa
52. Senegal – Visa on Arrival
53. Hong Kong – No Visa
54. Zambia – eVisa
55. Zimbabwe – eVisa
56. Macau– No Visa
57. South Korea – No Visa
58.Turks & Caicos Islands - No Visa
59. Svalbard - No Visa