ఆండ్రాయిడ్ ఫోన్‌లోనే ఆధార్‌కార్డు
కొత్త యాప్ ప్రారంభించిన యూఐడీఏఐ
ఇప్పుడు ఆధార్‌కార్డు జిరాక్స్‌లను జేబులో పెట్టుకొని తిరగాల్సిన పనిలేదు. టచ్ చేస్తే ఆధార్ వివరాలను మనం ఫోన్‌ల ద్వారానే చెప్పేయవచ్చు. ప్రస్తుతం జీవితంలో ముఖ్యమైన గుర్తింపుగా మారిన ఆధార్‌కార్డు అవసరం రోజు రోజుకు పెరుగుతోంది. ఇల్లు రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్, వాహనాల రిజిస్ట్రేషన్, రేషన్ కార్డులు, బ్యాంక్ ఖాతాలు, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇలా ఏ పని కావాలన్నా ఆధార్ కార్డు వివరాలు చెప్పా ల్సిందే. కొన్ని సందర్భాల్లో కార్డు అందుబాటు లో లేకపోవడం ఎక్కడో పెట్టి మరిచిపోవడం వంటి సంఘటనలు జరుగుతాయి. అలాంటి పరిస్థితి లేకుండా యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) ఎం ఆధార్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఆండ్రాయిడ్ ఫోన్‌లో 5.0 లాలీపాప్ వెర్షన్‌తో దాని ముందు వెర్షన్ అన్నింటిలో దీన్ని డౌన్‌లోడ్ చేసుకొని వాడుకోవచ్చు. అవసరం అనుకుంటే షేర్ చేసే అవకాశం ఉంది.
యాప్ ఇలా పని చేస్తుంది..
ఎంఆధార్ యాప్ గూగుల్ ప్లేస్టోర్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. యాప్ డౌన్‌లోడ్ చేసుకొని అందులో మన వివరాలు ఎంటర్ చేయడంతోనే ఫొటోతో పాటు పేరు, పుట్టిన తేదీ, చిరునామా ఇతర వివరాలు కనిపిస్తాయి. ఒరిజినల్ ఆధార్‌కార్డు కు సాఫ్ట్ కాపీలాగా ఉంటుంది. ఆండ్రాయిడ్ ఫోన్‌ల లో మాత్రమే ఈ సౌకర్యం ఉంది.
గుగుల్ ప్లేస్టోర్‌కు వెళ్లి ఎంఆధార్ డౌన్‌లోడ్ చేసుకొని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. యాప్‌కు పాస్‌వర్డ్, యూజర్ పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేసుకోవాలి. అంతే కాకుండా ఆధార్ క్విక్ రెస్పాన్స్ (క్యూఆర్) కోడ్‌ను కూ డా స్కాన్ చేసి ముందుకు వెళ్లే అవకాశం ఉంది. మన వివరాలన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ వస్తుంది. ఓటీపీ, ఆధార్ రిజిస్ట్రేషన్ నంబర్‌కు వచ్చే నంబర్ ఎంటర్ చేయాలి. ఆధార్‌కార్డు డిస్‌ప్లే వచ్చిన తర్వాత మన క్రియేట్ చేసుకున్న యాప్ పాస్‌వర్డ్ ను నమోదు చేయాలి. వెంటనే మన ఆధార్ కార్డు స్ర్కీన్‌పైకి వచ్చేస్తుంది. దీనిని ఫోన్‌లోనే ఇమేజ్ రూపంలో చేసుకోవచ్చు. ఒకసారి మొబైల్ నంబర్‌లో రిజిష్టర్ అయితే నేరుగా ఆధార్ నంబర్ ప్రొఫైల్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఆధార్ కార్డును టచ్ చేస్తే రెండు వైపుల వివరాలు కనిపిస్తాయి.
స్కానింగ్ చేయడం తప్పింది..
- పోకల సుమన్, ఎలక్ట్రానిక్ వ్యాపారి
ఆధార్ కార్డును స్కానింగ్ చేయడం మళ్లీ అప్‌లోడ్ చేసు కునే బాధ తప్పింది. నేరుగా కొత్త యాప్ ద్వారా ఆధార్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవ డంతో పాటు నేరుగా షేరింగ్ చేసుకోవచ్చు. వాహనాల రిజిస్ట్రేష న్, బ్యాంక్ ఖాతాలు, ట్యాక్స్ అవసరాలకు ఆధార్‌కార్డును అడుగుతున్నారు. యాప్ ద్వారా డౌన్ లోడ్ చేసుకుని ఆధార్‌కార్డు ఒరిజినల్ ఆధార్‌కార్డుకు సాఫ్ట్‌కార్డులాగానే ఉంటుంది. ఆధార్‌కార్డు ఎక్కడో పెట్టి వెతుక్కునే అవసరం కూడా ఉండదు.
ఆధార్ యాప్ ఎంతో ఉపయోగం..
- బుస్స పవన్, బిజినెస్
ఇప్పుడు ప్రతి పనికి ఆధార్ కార్డును అడుగుతున్నారు. యూఐడీఏఐ కొత్తగా ఆండ్రా యిడ్ ఫోన్‌ల కోసం యాప్ ను ఏర్పాటు చేయడం ఎంతో ఉపయోగకరంగా మారింది. యాప్ వల్ల ఆధార్‌కార్డును డౌన్‌లోడ్ చేసుకొని ఎక్కడైనా ఉపయో గించుకునే వీలు కలిగింది. ఆండ్రాయిడ్ ఫోన్‌లలో 5.0 వర్షన్ కాకుండా అన్ని ఆండ్రాయిడ్ ఫోన్‌లకు ఈ సౌకర్యం ఉపయోగించుకునే విధంగా మార్చాలి. వినియోగదారులకు సౌకర్యంగా ఉంటుంది.