ఆంగ్లంపై పట్టు.. విదేశీ విద్యకు మెట్టు

నైపుణ్యానికి విదేశీ విశ్వవిద్యాలయాల ఎర్రతివాచీ 

జీఆర్‌ఈ, ఐల్స్‌లో మంచి స్కోరు సాధనకు సోపానాలు
 
ఆంగ్లంలో చదవడం.. రాయడం, వినడం, మాట్లాడ టంలో నైపుణ్యాన్ని ఒడిసి పట్టిన విద్యార్థులకు విదేశీ విశ్వవిద్యాలయాలు తివాచీ పరుస్తుంటాయి. ఐఈఎల్‌ aటిఎస్‌ (ఐల్స్‌), జీఆర్‌ఈ, టోఫెల్‌ పరీక్షల్లో సాధించిన మార్కుల ఆసరగా అవి సీట్లు ఇస్తుంటాయి. ఐల్స్‌లో తొమ్మిది పాయింట్లకు గాను కనీసం ఆరు పాయింట్లు సాధిస్తే ఆసే్ట్రలియా, యూఎస్‌ఏ, న్యూజిలాండ్‌, కెనడా లలోని 90 శాతం విశ్వవిద్యాలయాల్లో ఎమ్మెస్‌ సీటు ఇస్తున్నారు. అమెరికాలోని ప్రతిష్టాత్మక విశ్వవిద్యాల యాల్లో ఎమ్మెస్‌ చేయాలంటే జీఆర్‌ఈలో మంచి స్కోర్‌ తప్పనిసరి. ఐల్స్‌ స్కోరును తొమ్మిది వేలకు పైగా విశ్వవిద్యాలయాలు ప్రామాణికంగా తీసుకుంటు న్నా యి. విజయవాడ నుంచి ప్రతి నెలా 300 మందికి పైగా విద్యార్థులు యూఎస్‌లో ఎమ్మెస్‌ చేయడానికి ఫ్లై ట్‌ ఎక్కుతున్నారని గణాంక నిపుణుల అంచనా. ఐల్స్‌, జీఆర్‌ఈల్లో ఉత్తమ స్కోరు సాధనకు అనుసరిం చాల్సిన మార్గాలపై నిపుణుల సూచనలు మీకోసం...
 
 
తెలుగు విద్యార్థులు కోర్‌ సబ్జెక్ట్‌ లు, గణితంలో మంచి ప్రతిభ కనబరుస్తున్నా ఆంగ్లంలో భావవ్యక్తీకరణలో వెనకబాటుతనం కనిపిస్తోందని, మాతృ భాషలో సైతం పట్టు లేకపోవడమే సమస్యగా ఉందని నిపు ణులు పేర్కొంటున్నారు. ఆంగ్ల మాధ్యమంలో ప్రాథమిక విద్యాభ్యాసం చేయడంతో సరిపెట్టి భాషా నైపుణ్యంపై శ్రద్ధ పెట్టకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందనేది వారి వాదన. ఆంగ్ల దినపత్రికలు చదవడం, ఆంగ్ల ప్రసంగాలు వినడం ద్వారా ఈ లోపాన్ని సవరించుకోవచ్చంటున్నారు. భాషా నైపుణ్యాలు, భావ సంపద, ప్రాథమిక గణిత నైపుణ్యాలు, రీజనింగ్‌, ఎనలిటికల్‌ సామర్థ్యాలు సంతరించుకుంటే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని సూచిస్తున్నారు.

జీఆర్‌ఈలో స్కోరు కష్టమేమీ కాదు.. 
జీఆర్‌ఈలో కఠిన పరీక్ష ఇదే. రెండు విభాగల్లో మొత్తం 40 ప్రశ్నలుంటాయి. ఒక్కో విభాగంలో 20 ప్రశ్నల వంతున సెంటెన్స్‌ ఈక్విలెన్స్‌పై ఐదు, టెక్ట్‌ కాంప్రహెన్షన్‌పై ఐదు, రీ డింగ్‌ కాంప్రహెన్షన్‌పై పది ప్రశ్నలుంటాయి. ఒక్కో విభా గానికి 30 నిమిషాలు కేటాయిస్తారు. వీటిలో రాణించాలంటే ఆంగ్లపుస్తక పఠనం, ఆంగ్ల దినపత్రికలు చదువుతూ పద సంపద పెంచుకోవాలి.
 
అవాలో మంచి స్కోరు సాధించాలంటే.. 
జీఆర్‌ఈ అవా విభాగంలో రెండు వ్యాసరూప ప్రశ్నలు రా యాల్సి ఉంటుంది. ఒకటి విశ్లేషణాత్మక సమాధన వ్యాసం. రెం డోది వాద ప్రతివాద రూపక వ్యాసరూపక ప్రశ్న ఉం టాయి. అవా విభాగంలో మంచి స్కోరు సాధించడానికి వ్యాసాలకు ఇచ్చిన అంశాలపై మేధోమధనం చేసి కీలక భావనలను వీడకుండా వ్యాసం రాయాలి. ఆంగ్ల వ్యాకరణం పై పూర్తి స్థాయి పట్టు సాధించాలి. అవసరమైన సందర్భా ల్లో సజీవ సాక్ష్యాలను కోట్‌ చేస్తూ వ్యాసం రాస్తే అదనపు మార్కులు సాధించవచ్చు. వాదప్రతివాద ప్రశ్నలో ఎంచు కున్న వాదాన్ని సమర్థిస్తూ సోదాహరణంగా వ్యాసం రాస్తే రాణించవచ్చు.
 
వెర్బల్‌లో స్కోరు సాధించండి ఇలా.. 
రోజుకు ఇరవై నుంచి 30 వరకూ పదాలను సమానార్థకా లతో సహా నేర్చుకుంటే సమయపాలనకు ఉపకరిస్తుంది. పదసంపద పెంచుకోవడానికి రోజుకు గంట సమయం కేటా యించాలి. జీఆర్‌ఈ వర్డ్‌ రూట్స్‌, వర్డ్‌ గ్రూప్స్‌ సాధన చేయా లి. రోజూ కొన్ని మాదిరి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం ద్వారా పరీక్షపై పట్టు సాధించవచ్చు. ప్రశ్నల్లో అంతర్లీనంగా దాగి ఉన్న కీలక పదాన్ని (కీ వర్డ్‌)ను గుర్తించడం ద్వారా సులభంగా సాధించవచ్చు. ప్రతి ప్రశ్నలోనూ దాగి ఉండే కాంట్రాస్ట్‌, సపోర్ట్‌, కేమ్‌ అండ్‌ అఫెక్ట్‌ ఇండికేటర్స్‌ను గుర్తిం చడం కూడా స్కోరింగ్‌లో కీలక పాత్రపోషిస్తుంది. ఎలిమినే షన్‌ ద్వారా సులభంగా సమాధానాలు రాబట్టడం మరో పద్ధ తి. ప్రశ్నల వర్గీకరణ ద్వారా ప్రశ్నల వర్గానికి సంబంధించిన పదాలు మాత్రమే పరిగణనలోకి తీసుకుని జవాబులు రాబట్టడం ఇంకో పద్ధతి. రీడింగ్‌ కాంప్రహెన్షన్‌లో మార్కుల సాధనకు కూడా ఇదే ఉత్తమ పద్థతి.
 
జీఆర్‌లో స్కోర్‌ సాధనకు క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ కల్పతరువు. ఈ విభాగంలో రెండు వర్గాల ప్రశ్నలుంటాయి. ఒక్కోసెక్షన్‌లో 20 ప్రశ్నలుంటాయి. ఈ ప్రశ్నలు అర్థమెటిక్‌, ఆల్జీబ్రా, జామెట్రీ, డేటా ఎనాలసిస్‌, వర్డ్‌ప్రాబ్లమ్స్‌పై ఉంటా యి. ప్రణాళిక బద్ధంగా సాధన చేస్తే మంచి స్కోరు సాధిం చొచ్చు. 6 నుంచి పదో తరగతి వరకు పాఠ్యపుస్తకాల్లోని లెక్కలు సాధన చేస్తే మంచి మార్కులు సాధించొచ్చు.
 
ఐల్స్‌లో అత్యధిక మార్కుల కోసం..
ఐల్స్‌లో 6.5 స్కోరు సాధిస్తే ఆస్ట్రేలియా, యూ ఎస్‌, కెనడా, న్యూజిలాండ్‌ల్లోని మంచి విశ్వవిద్యాల యాల్లో సీటు సాధించవచ్చంటున్నారు నిపుణులు. చదవడం, రాయడం, వినడం, మాట్లాడటం ఇలా నా లుగు విభాగాలుగా పరీక్ష ఉంటుంది. 2 గంటల 40 నిమిషాల సమయం ఇస్తారు. రీడింగ్‌ విభాగంలో మూడు పాసేజ్‌లు ఇచ్చి 40 ప్రశ్నలు అడుగుతారు. గంటలో సమాధానాలు ఇవ్వాలి.  రాత విభాగంలో రెండు టాస్క్‌లు (లక్ష్యాలు) ఇస్తారు. టాస్క్‌1లో చార్ట్‌, గ్రాఫ్‌, డయాగ్రమ్‌, మ్యాప్‌, టేబుల్‌లలో ఏదో ఒకటి ఇచ్చి దానిపై 150 పదాలతో నివేదిక రాయాలని కోరతారు. దీనికి 20 ని మిషాల సమయమిస్తారు. టాస్క్‌-2లో స్టేట్‌మెంట్‌, సామెత, సమస్యల్లో ఏదో ఒకటి రావచ్చు. దీనిపై 250 పదాలకు మించకుండా వ్యాసం రాయాలి. 40 నిమిషాలు కేటాయిస్తారు. రాత విభాగంలో మంచి స్కోరు సాధించాలంటే ప్రశ్న అడిగే అవకాశం ఉన్న అన్ని అంశాలపై తర్ఫీదు, సాధన అవసరం.
 
వినడం (లిజనింగ్‌) విభాగంలో ఒక ప్రొఫె సర్‌ ఉపన్యాసాన్ని 30 నిమిషాలు సీడీ ప్లే చేసి 40 ప్రశ్నలు ఇస్తారు. సీడీ ప్లే చేసే సమ యంలోనే వాటికి సమాధానాలివ్వాలి. వింటూనే సమాధానాలు ఇవ్వాల్సి ఉ న్నందున ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెం చుకోవాలి. మాట్లాడే విభాగంలో పరీక్ష ఐల్స్‌ పరీక్షకు స్లాట్‌కు ముందు, వెనుక గా ఎప్పుడైనా నిర్వహించే అవకాశం ఉంది. పార్ట్‌-1లో 4 నుంచి 5 నిమి షాల సాధారణ ముఖాముఖి నిర్వహి స్తారు. పార్ట్‌-2లో చిన్న క్యూకార్‌ (హిం ట్‌) ఇచ్చి దానిపై రెండు నిమిషాలు మాట్లాడిస్తారు. పార్ట్‌-3లో పార్ట్‌-2 అం శంపై గ్రూప్‌ డిస్కషన్‌ నిర్వహిస్తారు. నాలుగు నుంచి ఐదు నిమిషాల్లో ఇది ముగుస్తుంది. విజయవాడలో నెలకు రెండు పర్యాయాలు పరీక్ష రాసే వెసు లుబాటు ఉంది. హైదరాబాద్‌లో నెల కు నాలుగు సార్లు పరీక్ష రాసుకునే వెసులుబాటు ఉంది.