ఎన్నారైల పిల్లలకు భారత్‌ స్కూళ్లలో ఫీజులెక్కువగా ఉంటాయా..?

 ఓసీఐ, పీఐవో కార్డులున్న వారు భారత్‌లో స్థిరపడటానికి వస్తుంటారు. అటువంటి వారు తమ పిల్లలను చదివించేందుకు దగ్గరలోని స్కూళ్లను ఎంచుకుంటారు. కొన్ని ప్రయివేటు పాఠశాలలు, సంస్థలు ఎన్నారైల పిల్లలకు ఫీజులో వ్యత్యాసం చూపిస్తుంటాయి. వారి వద్ద ఎక్కువమొత్తంలో డబ్బు వసూలు చేస్తుంటాయి. అయితే భారత నిబంధనల ప్రకారం పీఐవో, ఓసీఐ కార్డులున్న వారు భారతసంతతి వ్యక్తులే. వారికీ, భారతీయ పౌరుడికీ కొన్ని విషయాల్లో సమాన హక్కులు ఉంటాయి. 

ఓటు హక్కు, వ్యవసాయ భూమిని కొనడం వంటి కొన్ని విషయాల్లో తప్ప మిగిలిన అంశాల్లో భారతీయ పౌరుడితోపాటు సమాన అవకాశాలు ఉంటాయి. అందువల్ల ప్రభుత్వ కళాశాలలు, పాఠశాలలు, యూనివర్శిటీల్లో వారికి రిజర్వేషన్లు కల్పించారు. వారికి అందరితోపాటు సమానంగా ఫీజు ఉంటుంది. అయితే కొన్ని ప్రయివేటు సంస్థలు వారి కోసమే ప్రత్యేకంగా కళాశాలలు, స్కూళ్లు ఏర్పాటు చేస్తుంటాయి. వాటిలోని ఫీజును ప్రభుత్వం నిర్ధేశించలేదు. అందువల్ల ఎన్నారైల ఆర్థిక పరిస్థితిని బట్టి వాటిలో చేరడం చేరకపోవడం వంటివి చేయడం మంచింది.