విరాళం ఇవ్వడంలోనూ ఎన్నారైలకు నిబంధనలు

 మీకు విదేశాల్లో మిత్రులెవరైనా ఉన్నారా..? వారికి గిఫ్ట్‌గా డబ్బును ఇవ్వాలనుకుంటున్నారా..? విదేశాల్లోని ఏదయినా స్వచ్ఛంద సంస్థకు విరాళం ఇవ్వాలనుకుంటున్నారా..? విదేశాల్లోని ఏదయినా విద్యాసంస్థకు, సాంస్కృతిక కార్యక్రమాలకు దానం చేయాలనుకుంటున్నారా..? అయితే మీరు ఓ విషయం తప్పకుండా తెలుసుకోవాలి. మీ మనసు పెద్దదై ఎక్కువ మొత్తంలో డబ్బు పంపిస్తామంటే కుదరదు. భారతీయులు విదేశాల్లోని సంస్థలకు ఇచ్చే విరాళాలకు పరిమితి ఉంది. సంవత్సరానికి కేవలం అయిదు వేల(5000) డాలర్లను మాత్రమే ఆయా సంస్థలకు విరాళంగా పంపించొచ్చు. ఒకవేళ అంతకంటే ఎక్కువ పంపించాలనుకుంటే మాత్రం రిజర్వుబ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అనుమతి తీసుకోవాల్సిందే...