పాన్‌కార్డు పొందండి ఇలా..

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేస్తే రెండు రోజుల్లో నెంబరు లభ్యం

ఆఫ్‌లైన్‌లో కార్డు చేరేది 20 రోజుల తరువాతే 

నగదు సంబంధిత వ్యవహారలన్నింటికీ ప్రస్తుతం పాన్‌కార్డు అత్యవసరమయింది. ఆఖరికి పరిమితి మించి బంగారం కొనుగోలు చేయాలన్నా ఈ కార్డు చూపించాల్సిందే. మరి ఈ కార్డును ఎలా పొందాలి. ఎన్ని రోజులకు వస్తుంది, తదితర వివరాలు మీకోసం..
 
బ్యాంకుల్లో రూ.50 వేలకు పైగా నిర్వహించే ప్రతి ఆర్థిక లావాదేవీకీ  శాశ్వతఖాతా సంఖ్య(పాన్‌ కార్డు) అవసరం. తాజాగా బ్యాంక్‌లో ఖాతా ప్రారంభించాలన్నా పాన్‌ కార్డును పొందుపర్చాలని కొంతమంది బ్యాంకర్లు ఒత్తిడి చేస్తున్నారు. పాన్‌ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న 15 లేదా 20 రోజులలో మాత్రమే ఆదాయపన్ను శాఖ జారీ చేస్తుంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని రెండురోజుల్లోనే శాశ్వత ఖాతా సంఖ్యను తెలుసుకునే  వీలుంది. దీనివల్ల అత్యవసర సమయంలో నెంబరు చెప్పేందుకు ఎంతగానో ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి. బ్యాంక్‌ లావాదేవీలు, పెట్టుబడులు, స్థిరాస్తి కొనుగోలు, అమ్మకాలలో పాన్‌కార్డు తప్పనిసరి.  సార్వత్రికమైన 10 అంకెలు అల్ఫాన్యూమరిక్‌ పాన్‌కార్డును ఆదాయపన్నుశాఖ ప్రతి పన్ను చెల్లింపుదారునకు జారీ చేస్తుంది. ఈ కార్డు కోసం రాత పూర్వకంగా దరఖాస్తు చేసుకుంటే 20 రోజులలో జారీ చేస్తారు. ఎన్‌ఎ్‌సడీఎల్‌వెబ్‌సైట్‌ ద్వారా ఆదాయపన్నుశాఖ అవకాశం కల్పిస్తోంది. 
 
పాన్‌కార్డు జారీ ఇలా

పాన్‌కార్డును భారత ఆదాయపన్నుశాఖ జారీ చేస్తుంది. దీని కోసం www.tun.insdl.com  వెబ్‌సైట్‌లోకి లాగిన్‌ అవ్వాలి. వెబ్‌ సైట్‌ ముఖ చిత్రం దిగువ భాగంలో ఆన్‌లైన్‌ పాన్‌ అఫ్లికేషన్‌ క్లిక్‌ చేయాలి. అక్కడ ఆన్‌లైన్‌ వద్ద భారతీయులైతే న్యూపాన్‌- ఇండియన్‌ సిటిజన్‌(ఫారం 49ఏ) విదేశీయులైతే న్యూపాన్‌-ఫారిన్‌ సిటిజన్‌(ఫారం-49ఏఏ) క్లిక్‌ చేయాలి. ఆన్‌లైన్‌ దరఖాస్తు రెండో విండో ఒపెన్‌ అవుతుంది. ఈ ఆన్‌లైన్‌ ఫారంలో చిరునామా, ఆదాయపన్నుశాఖ సర్కిల్‌, రేంజ్‌, ఏరియాకోడ్‌, ఏవో కోడ్‌ వంటి వాటిని పూర్తి చేయాలి. ఆ వివరాలు వెబ్‌సైట్‌లో పొందుపర్చాలి.

అదేవిండోలో ఉన్న మార్గదర్శకాలను చదువుకోవాలి. ఫారం రకాన్ని ఎంచుకోవాలి. డిజిటల్‌ సిగ్నేచర్‌ సర్టిఫికెట్‌ కావాలా? డిజిటల్‌ సిగ్నేచర్‌ లేని సర్టిఫికెట్‌ కావాలా? అనే ఆప్షన్‌ ఎంచుకుని వివరాలు మొత్తం పూర్తి చేయాలి. పాన్‌ కార్డుకు సంబంధించిన వివరాలను వెబ్‌సైట్‌లో లభ్యమవుతాయి. పాన్‌/టాన్‌ కార్డు దరఖాస్తు స్థితి తెలుసుకోవడం, ఇ-రిటర్న్‌ రిజస్ర్టేషన్‌ స్థితి తెలుసుకోవడం, పాన్‌కు సంబంధించిన ఫిర్యాదులు, పాన్‌ డేటాలో మార్పులు, చేర్పులు చేసుకునే వీలుంది.

వివరాలన్నీ ఆన్‌లైన్‌ దరఖాస్తు ఫారంలో నింపి అవసరమైన ధ్రువపత్రాలను జత చేసి సమర్పించాలి. దరఖాస్తు నెంబరు ప్రకారం రశీదు కూడా పొందే వీలుంది. ఈ నెంబరు ప్రకారం అఫ్లికేషన్‌ స్టేటస్‌ ట్రాక్‌ చేసుకునే వీలుంది. సాధారణంగా 15 నుంచి 20 రోజుల్లో పాన్‌కార్డు వస్తుం ది.  ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే కేవలం రెండురోజుల్లో మీకు కేటాయించిన పాన్‌ కార్డు స ంఖ్య తెలుసుకోవచ్చు. తర్వాత రిజస్టర్డ్‌ పోస్టు ద్వారా పాన్‌కార్డు అందుతుంది. పాన్‌కార్డు భారతదేశం పరిధిలో పంపించడానికి రూ.110, ఇతర దేశాలకు రూ.1020 ఆన్‌లైన్‌లో చెల్లించాల్సి ఉంటుంది. 
ఆఫ్‌లైన్‌లో అయితే..
ఆఫ్‌ లైన్‌లో అయితే ఇదే వెబ్‌ సైట్‌ నుంచి దరఖాస్తు డౌన్‌లోడ్‌ చేసుకుని సంతకంతో కూడిన కలర్‌ ఫొటో, వ్యక్తిగత గుర్తింపు కార్డుగా ఆధార్‌కార్డు, చిరునామా గుర్తింపు పత్రం రూ.110 డీడీ పొందుపర్చాలి.  ఇన్‌కంట్యాక్స్‌ పాన్‌ సర్వీసు యూనిట్‌, 5వ ఫ్లోర్‌, మంత్రి స్ర్టీట్‌, ఫ్లోర్‌ నెం.341, సర్వేనెం.997/8, మోడల్‌ కాలనీ, నియర్‌ దీప్‌ బంగ్లా చౌక్‌, పుణే-411016 అనే చిరునామాకు పంపించాలి.