ఎన్నారైలూ.. భారత్‌లో గ్యాస్‌ కనెక్షన్‌ తీసుకోవాలనుకుంటున్నారా?

 

అప్పుడప్పుడు భారత్‌లో నివాసం ఉండేందుకు వచ్చే ఎన్నారైలకు, పూర్తిగా ఇండియాలో స్థిరపడేందుకు వచ్చే ఎన్నారైలకు గ్యాస్‌ కనెక్షన్‌ తప్పనిసరి. బ్లాక్‌ మార్కెట్‌లో అధిక ధర వెచ్చించి తీసుకోవడం కంటే ఏజెన్సీ ద్వారా తీసుకోవడం ఉత్తమం. హెచ్‌పీ, భారత్‌, ఇండేన్‌ వంటి పలు ఎజెన్సీలు డీలర్ల  ద్వారా గృహ వినియోగదారులకు గ్యాస్‌ సిలెండర్లను సరఫరా చేస్తున్నాయి. గ్యాస్‌ కనెక్షన్‌ను ఆన్‌లైన్‌ ద్వారా కూడా తీసుకోవచ్చు. 

కనెక్షన్‌ తీసుకోవడం ఎలా:
1)మొదట మీరు ఏ ఏజెన్సీ గ్యాస్‌ కనెక్షన్‌ తీసుకోవాలనుకుంటున్నారో నిర్ణయించుకోవాలి. అనంతరం మీకు దగ్గర్లోని సదరు గ్యాస్‌ ఏజెన్సీ డీలర్‌ వద్దకు వెళ్లి అప్లికేషన్‌ పెట్టుకోవాలి.
2) ఆ అప్లికేషన్‌ను నింపి దానితోపాటు కొన్ని డాక్యుమెంట్లు అందజేయవలసి ఉంటుంది. 
ఎ)ప్రూఫ్‌ ఆఫ్‌ ఐడెంటిటీ (పాస్‌పోర్ట్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌ వగైరా..)
బి)ప్రూఫ్‌ ఆఫ్‌ అడ్రస్‌ (హౌస్‌ ట్యాక్స్‌, ఎలక్ట్రిసిటీ బిల్‌)
3)ఓ గెజిటెడ్‌ ఆఫీసర్‌ సంతకంతో కూడిన సెల్ఫ్‌ డిక్లరేషన్‌ డాక్యుమెంట్‌. 
4)అవసరమైన డాక్యుమెంట్లతో పాటు నిర్దేశించిన ఫీజు చెల్లించిన రెండు లేదా మూడు రోజుల్లో మీకు గ్యాస్‌ కనెక్షన్‌ లభిస్తుంది. 
5)ఈ పద్ధతిలో కాకుండా ఆన్‌లైన్‌ ద్వారా కూడా మీరు గ్యాస్‌ కనెక్షన్‌ తీసుకోవచ్చు. డైరెక్ట్‌గా ఏజెన్సీ వెబ్‌సైట్‌లోకి లాగిన్‌ అయి అప్లయ్‌ చేసుకోవచ్చు.  
5)చాలామంది డీలర్లు గ్యాస్‌ కనెక్షన్‌తోపాటు స్టవ్‌లు కూడా తప్పనిసరిగా అక్కడే తీసుకోవాలని చెబుతారు. అయితే మీకు నచ్చితేనే తీసుకోవచ్చు.