అవసరానికో యాప్‌!

భారత్‌లో భారీగా పెరుగుతున్న మొబైల్‌ యాప్‌ల వినియోగం
అవసరం ఉన్నా లేకున్నా డౌన్‌లోడ్‌
సోషల్‌ యాప్‌లకే మొదటి ప్రాధాన్యం
గేమింగ్‌, ఓటీటీ అప్లికేషన్లకూ భారీ ఆదరణ
దేశంలో స్మార్ట్‌ఫోన్ల వినియోగంతోపాటు అప్లికేషన్ల (యాప్‌) వినియోగం కూడా భారీగా పెరుగుతోంది. టెక్‌ఆర్క్‌ అనే మార్కెట్‌ రీసెర్చ్‌ సంస్థ తాజా నివేదిక ప్రకారం భారతీయు స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులు రోజుకు గరిష్ఠంగా 24 యాప్‌లు వినియోగిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్‌ యూజర్లలో 38 శాతం మంది రోజుకు 6-10 యాప్‌లు ఉపయోగిస్తున్నారట. ఇది ప్రపం చ సరాసరి (రోజుకు 9 వరకు యాప్‌ల వినియోగం)కంటే అధికమని నివేదిక వెల్లడించింది. యాప్‌ అన్నీ అనే అధ్యయనంలో భారతీయుల యాప్‌ వినియోగంపై వెల్లడైన ఆసక్తికర విషయాలు..
 
దేశంలో చాలా మంది స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులు పెద్దగా అవసరం ఉన్నా లేకున్నా యాప్స్‌ను డౌన్‌ చేస్తారట.
భారతీయులు స్మార్ట్‌ఫోన్‌లలో కనిష్ఠంగా 5, సగటున 51, గరిష్ఠంగా 207 యాప్స్‌ ఇన్‌స్టాల్‌ చేసుకుంటారట. కానీ వాడేది మాత్రం సగటున 24 యాప్సేనట.
ఇండియన్‌ స్మార్ట్‌ఫోన్‌ యూజర్లలో 76 శాతం మంది రోజూ సోషల్‌ మీడియా యాప్స్‌ ఉపయోగిస్తారు. 70 శాతంతో మొబైల్‌ గేమింగ్‌ యాప్‌లు రెండో స్థానంలో ఉన్నాయి.
లైవ్‌ టీవీ, వీడియో ఆన్‌ డిమాండ్‌ వంటి ఓవర్‌ ది టాప్‌ (ఓటీటీ) ఎంటర్‌టైన్‌మెంట్‌ యాప్స్‌కు డిమాండ్‌ అనూహ్యంగా పెరుగుతోంది. 40 శాతం మంది వినియోగదారులు రోజువారీగా ఈ యాప్స్‌ ద్వారా వీడియో కంటెంట్‌ను వీక్షిస్తున్నారు.