విదేశాల్లో ఉండేటప్పుడు భద్రత విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వీసా, పాస్‌పోర్ట్, పీఐవో కార్డుల వంటివే కాపాడతాయి. అయిఏ వాటిపై ఏ మాత్రం పేరు తప్పుగా ఉన్నా చిక్కుల్లో పడాల్సి వస్తుంది. ఒక్కోసారి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, మన తప్పులేకున్నా పాస్‌పోర్టుపై పేరు తప్పుగా వస్తుంది. అది పాస్‌పోర్ట్ అధికారుల తప్పయినా తిప్పలు మాత్రం మనకే. అందుకే పాస్‌పోర్టుపై పేరు కచ్చితమైన స్పెల్లింగ్‌తో ఉండేట్లు చూసుకోవాలి. ఒకవేళ తప్పుగా ఉంటే దాన్ని ఆలస్యం చేయకుండా సరిచేసుఓవాలి.
పేరు సరిచేసుకోవడానికి దరఖాస్తు విధానం:
2. ఈ లింక్ ఓపెన్ అయిన తర్వాత ‘సర్వీస్ డిజైర్డ్’ అని ఉన్న చోట ‘రీ-ఇష్యూ ఆఫ్ పాస్‌పోర్టు’ను సెలక్ట్ చేసుకోవాలి.
3. ఆ తర్వాత ఒరిజినల్ పేరును, ఇంటిపేరును రాయాలి. దానికిందే పాస్‌పోర్టులో తప్పుగా ముద్రించిన పేరును కూడా రాయాల్సి ఉంటుంది. వీటితోపాటు మిగిలిన అంశాలను నింపి ఆన్‌లైన్ దరఖాస్తును పూర్తిచేయాలి.
4. దరఖాస్తును నింపి దాని కాపీని తీసుకోవాలి. దానికి సంబంధిత పత్రాలను జతచేసి మెయిల్ ద్వారాగానీ, నేరుగా గానీ ఎంబసీ/ కాన్సులేట్‌కు పంపించవచ్చు.
5. ఎంబసీ/ కాన్సులేట్ అధికారుల అనుమతి తీసుకుని తత్కాల్ సర్వీసును ఉపయోగించవచ్చు.
దరఖాస్తుకు జతచేయాల్సిన పత్రాలు
1. ఒరిజినల్ పాస్‌పోర్టు కాపీ
2. పాస్‌పోర్టులోని మెదటి, చివరి రెండు పేజీల కాపీలు
3. మీ పేరు కరెక్టుగా ఉన్న పత్రాలు. జన్మ ధృవీకరణ పత్రాలు, స్కూలింగ్ సర్టిఫికెట్‌లు, డ్రైవింగ్ లైసెన్స్ వంటివాటిని జతచేయవచ్చు.
వీటిపై గెజిటెడ్ సంతకం చేసి దరఖాస్తుకు జత చేయాలి. దరఖాస్తును సమర్పించేందుకు పాస్‌పోర్టు కార్యాలయం నుంచి అపాయింట్‌మెంట్ తీసుకోవాలి. వారు సూచించిన సమయంలో కార్యాలయానికి వెళ్లి దరఖాస్తును సమర్పించాలి.