పాలసీ తీసుకునేటప్పుడు ఇవి పాటించండి

 పాశ్చాత్య దేశాల్లో మెడికల్ ఇన్సూరెన్స్ సాధారణ విషయమే.. కొద్ది సంవత్సరాలుగా భారతదేశంలో కూడా మెడికల్ ఇన్సూరెన్స్ పట్ల అవగాహన పెరుగుతోంది. సాధారణ, మధ్య తరగతి వర్గాల వారు కూడా మెడికల్ ఇన్సూరెన్స్‌ను తీసుకుంటున్నారు. ప్రస్తుతం కార్పోరేట్ ఆసుపత్రుల్లో మెడికల్ ఖర్చును భరించే స్థాయిలో ప్రజలు లేరు. అందుకే వారు ఇన్సూరెన్స్ కంపెనీలను ఆశ్రయిస్తున్నారు. ఒకప్పుడు ఎల్‌ఐసీ, నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ వంటి ప్రభుత్వ కంపెనీలే ఉండేవి. బీమా రంగంలో ఎఫ్‌డీఐలను ప్రభుత్వం అనుమతించడంతో ప్రైవేటు కంపెనీలు విచ్చలవిడిగా పెరిగిపోయాయి. అందుకే మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.

 
1. పాలసీలో కవర్ అయే, కాని అంశాలను ఒకటికి పది సార్లు చెక్ చేసుకోవాలి.
2. పోషణ, ఆసుపత్రిలో ఉండటానికి అయే ఖర్చు ప్రీమియంలో లభిస్తాయా...
3. ఫలానా డాక్టరు, ఆసుపత్రి వద్దకే వెళ్లాలనే నిబంధనలు ఏమయినా పాలసీలో ఉన్నాయా.. అటువంటివి ఏమయినా ఉంటే  ఆ పాలసీని తీసుకోకండి.
4. కొన్ని రకాల హెల్త్ పాలసీలకు వెయిటింగ్ పిరియడ్ ఉంటుంది. ఆ టైమ్ పిరియడ్ దాటిన తర్వాతే మీరు తీసుకునే పాలసీ వర్తిస్తుంది. మీరు తీసుకోబేయే పాలసీకి ఇటువంటి నిబంధనలు ఏమయినా ఉన్నాయో, లేదో చెక్ చేసుకోండి
5. పాలసీ చికిత్సకు మాత్రమేనా.. లేక మందులకు కూడానా అనేది నిర్థారించుకోండి..
6. ఎంతకాలం పాటు ప్రీమియం చెల్లించాలో సరి చూసుకోండి
7. మీ పాలసీని మీ ప్రమేయం లేకుండా తొలగించే హక్కు ఇన్సూరెన్స్ కంపెనీకి ఉందా.. అనేది తెలుసుకోండి
8. ఎంత వయస్సు వరకూ పాలసీ రెన్యూవల్ అవుతుందో తెలుసుకోండి..