పాస్‌పోర్ట్‌పై జీవిత భాగస్వామి పేరు తొలగించడానికి

జీవిత బాగస్వామి మరణించినా, విడాకులు తీసుకున్నా వారిపేరు పాస్‌పోర్టుపై తొలగించాల్సిన అవసరం వస్తుంది. అలా తొలగించడానికి పాస్‌పోర్ట్‌ రీ- ఇష్యూ సర్వీస్‌నే ఉపయోగించవచ్చు. అభ్యర్థి నేరుగాగానీ, ఈ మెయిల్‌ ద్వారాగానీ దరఖాస్తు చేయవచ్చు.

దరఖాస్తు విధానం:
1. http://passport.gov.in/nri/Online.do లింక్‌ను ఓపెన్‌ చేయండి
2. ఈ లింక్‌ ఓపెన్‌ అయిన తర్వాత ‘సర్వీస్‌ డిజైర్డ్‌’ అని ఉన్న చోట ‘రీ-ఇష్యూ ఆఫ్‌ పాస్‌పోర్టు’ను సెలక్ట్‌ చేసుకోవాలి.
3. ఆ తర్వాత దరఖాస్తును పూర్తి చేస్తూ ‘చేంజ్‌ ఇన్‌ ఎగ్జిస్టింగ్‌ పర్సనల్‌ పర్టిక్యులర్‌’ ఆప్షన్‌ను క్లిక్‌ చేయాలి. ఆ తర్వాత దానిలో ‘స్పూస్‌ నేమ్‌’ ను క్లిక్‌ చేయాలి.
4. దరఖాస్తును నింపి దాని కాపీని తీసుకోవాలి. దానికి సంబంధిత పత్రాలను జతచేసి మెయిల్‌ ద్వారాగానీ, నేరుగా గానీ ఎంబసీ/ కాన్సులేట్‌కు పంపించవచ్చు.
5. ఎంబసీ/ కాన్సులేట్‌ అధికారుల అనుమతి తీసుకుని తత్కాల్‌ సర్వీసును ఉపయోగించవచ్చు.
దరఖాస్తుకు జతచేయాల్సిన పత్రాలు
1. ఒరిజినల్‌ పాస్‌పోర్టు కాపీ
2. పాస్‌పోర్టులోని మెదటి, చివరి రెండు పేజీల కాపీలు
3. జీవిత భాగస్వామి చనిపోతే మరణ ధృవీకరణ పత్రం.
4. విడాకులు తీసుకుంటే విడాకుల ధృవీకరణ పత్రం.
వీటిపై గెజిటెడ్‌ సంతకం చేసి దరఖాస్తుకు జత చేయాలి. దరఖాస్తును సమర్పించేందుకు పాస్‌పోర్టు కార్యాలయం నుంచి అపాయింట్‌మెంట్‌ తీసుకోవాలి. వారు సూచించిన సమయంలో కార్యాలయానికి వెళ్లి దరఖాస్తును సమర్పించాలి.