అమెరికా వెళ్తున్నారా..? అయితే వీటిపై ఆశలు వదులుకోవాల్సిందే..!

 

వాషింగ్టన్: ‘అమెరికా.. అమెరికా.. ఆమెరికా.. అందమైన అమ్మాయిలాంటి అమెరికా’.. ఇది ఓ తెలుగు సినిమాలోని పాట. అగ్రరాజ్యంపై తెలుగువారికి ఉన్న క్రేజ్‌ను ఈ పాటే తెలియజేస్తోంది. ప్రతీ యేటా ఎంతోమంది చదువుకోవడం కోసమో, ఉద్యోగం చేయడానికో అమెరికా వెళ్తున్నారు. కొంతమంది అక్కడే స్థిరపడిపోతున్నారు. చదువుకుని, కొన్నాళ్లపాటు ఉద్యోగం చేస్తే సరి.. కానీ అక్కడే స్థిరపడిపోతే కొన్నింటిని వదులుకోవాల్సిందే. అలాగే ఇక్కడ నుంచి వెళ్లి.. అమెరికాలో స్థిరపడిపోవాలనుకుంటున్న వాళ్లు కూడా కొన్నింటిపై ఆశలు వదులుకోవాల్సిందే. 
 
1. తన వారసులు.. తమ మతాన్నే ఆచరించాలి... ఆచార వ్యవహారాలను పాటించాలి.. అని ప్రతిఒక్కరూ కోరుకుంటారు. కానీ ఎన్నారైలకు ఆ ఛాన్స్ లేదు. పిల్లలు వేరే మతాలను పాటించే అవకాశం చాలా ఎక్కువ. 
 
2. ఒకవేళ ఎప్పుడయినా ఇండియాకు వస్తే.. పిల్లలు అమ్మమ్మ, తాతయ్య, ఇతర కుటుంబ సభ్యులతో కలిసిపోవడం చాలా కష్టం. ఎప్పుడూ ల్యాప్ ట్యాప్, ఫోన్ వంటివాటితోనే గడిపేస్తుంటారు. 
 
3. పిల్లలు వేసుకునే దుస్తుల గురించి ఇక చెప్పనక్కర్లేదు. చక్కగా భారతీయ సంప్రదాయంలో వస్త్రదారణ ఉండాలని తల్లిదండ్రులు కోరుకుంటే అంతకుమించిన అత్యాశ ఉండదు. తెలుగు సంఘాలు జరుపుకునే వేడుకల్లో భారతీయ వస్త్రదారణతో కనిపించడానికి పిల్లలను తల్లిదండ్రులు ‘ఈ కొద్దిసేపే’ అని చెప్పి మరీ ఒప్పిస్తారట. 
 
4. విదేశీ కల్చర్ వల్ల మద్యం, డ్రగ్స్, సిగరెట్ స్మోకింగ్ వంటివి సులభంగా అలవాటవుతాయట. హైస్కూల్ వయసులోనే పిల్లలు చెడు అలవాట్లకు బానిసలవుతుంటారని అక్కడివారు చెప్పుకుంటుంటారు. 
 
5. కుటుంబంతో కంటే స్నేహితులతోనే ఎక్కువసేపు గడుపుతుంటారట. ఒక్కో సమయంలో కంబైన్డ్ స్టడీ అంటూ ఇంటికి కూడా రారు అంటూ తల్లిదండ్రులు వాపోతుంటారు. 
 
6. పిల్లలు కొన్నికొన్ని సమయాల్లో నిర్ణయాధికారాన్ని వారి చేతుల్లోకి తీసుకుని తల్లిదండ్రులకే ఎదురుతిరుగుతుంటారు. అంటే వారి మాటకు ఎదురు చెప్పడం, వారి ఇష్టానికి వారిని వదిలివేయడం ఉత్తమమని తల్లిదండ్రులు నిర్ణయానికి రావాలన్నమాట.