Change-address-in-passpoert

పాస్‌పోర్టుపై చిరునామాను ఇలా మార్చుకోవచ్చు

ఉద్యోగ నిమిత్తమో, చదువు రీత్యానో నేడు ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి వెళ్లక తప్పనిసరి పరిస్థితి. అటువంటి సమయాల్లో పాస్‌పోర్టుపై ఉన్న చిరునామా మార్చుకోవడం తప్పనిసరి. పాస్‌పోర్టుపై ఉన్న చిరునామా, ప్రస్తుతం ఉంటున్న చిరునామా ఒకటి కాకుంటే అక్కడి పోలీసుల నుంచి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. అందుకే అడ్రస్‌ మారిన వెంటనే పాస్‌పోర్టుపై చిరునామా మార్చుకుంటే ఇబ్బంది ఉండదు. అయితే అడ్రస్‌ మార్చుకోవడానికి, పాస్‌పోర్టు రీ-ఇష్యూకి ఒకటే దరఖాస్తు విధానం. దీనికి సంబంధించిన పత్రాలను జతచేసి స్వయంగా కాన్సులేట్‌కుగానీ, పోస్ట్‌ ద్వారాగానీ దరఖాస్తు చేసుకోవచ్చు.

 
దరఖాస్తుకు కావాల్సిన పత్రాలు
1. బీఎల్‌ఎస్‌ ఆర్డర్‌ దరఖాస్తు
2. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన కాపీ
3. చెక్‌లిస్ట్‌ను పూర్తి చేసి సంతకం చేయాలి
4. ప్రస్తుత పాస్‌పోర్టుతో పాటు ఒక కాపీ
5. నేషనాలిటీ వెరిఫికేషన్‌ పత్రం
6. మూడు పాస్‌పోర్టు సైజు ఫోటోలు
7. పాస్‌పోర్టులోని మొదటి అయిదు, చివరి రెండు పేజీల కాపీలు
8. నోటరీచేసిన ప్రస్తుత వీసా ఫోటోకాపీ

9. అడ్రస్‌ ప్రూఫ్‌

ప్రస్తుతం ఉంటున్న చిరునామాను ధృవీకరించేందుకు కావలసిన పత్రాలు
1. డ్రైవింగ్‌ లైసెన్స్‌
2. వాటర్‌, గ్యాస్‌, కరెంటు బిల్లు
3. స్టేట్‌ ఐడీ
4. రెంటల్‌ లీజు పత్రము
5. ల్యాండ్‌లైన్‌ ఫోన్‌ బిల్లు
వీటిలో ఏదయినా చిరునామా ధృవీకరణకు సరిపోతుంది. 
ఈ పత్రాలతో కూడిన దరఖాస్తును ఎంబసీ/కాన్సులేట్‌లో సమర్పించిన తరువాత ఇంకా వేరే పత్రాలు అవసరం అయితే కాన్సులేట్‌ మీకు సమాచారం అందిస్తుంది. దరఖాస్తును పరిశీలించిన తరువాత ఇంటర్వ్యూకి పిలుస్తారు. 
పాస్‌పోర్టుపై అడ్రస్‌ను మార్చడానికయే ఖర్చు
పెద్దవారికి
ఆర్డినరీ బుక్‌లెట్‌- 36 పేజీలు- 91.20 డాలర్లు
జంబో బుక్‌లెట్‌- 60 పేజీలు- 116.20 డాలర్లు
 
మైనర్ల పాస్‌పోర్టుపై చిరునామా మార్చుడానికి 66.20 డాలర్ల ఖర్చవుతుంది.