ఎన్నారైలూ.. బ్యాంక్‌ అకౌంట్‌ ఓపెన్‌ చేద్దామనుకుంటున్నారా?

 ఉద్యోగరీత్యానో, మరే కారణం వల్లనే విదేశాల్లో నివసిస్తున్న ఎన్నారైలకు తరచూ భారత్‌లోని తమ వాళ్లకు నగదు పంపించాల్సిన అవసరం ఏర్పడుతోంది. ఈ కారణం వల్ల ఎన్నారైలు భారత్‌లో కూడా ఓ బ్యాంక్‌ అకౌంట్‌ను కలిగి ఉంటే చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఎన్నారైల సంఖ్య పెరుగుతున్న కొద్దీ వారికి బ్యాంకింగ్‌ సేవలను అందించేందుకు చాలా సంస్థలు ముందుకొస్తున్నాయి. ఎక్కువగా యునైటెడ్‌ స్టేట్స్‌, ఆస్ట్రేలియా, జర్మనీ, యూకే, కెనడా వంటి దేశాల్లో నివసించే నాన్‌ రెసిడెంట్‌ ఇండియన్స్‌కు సేవలందించేందుకు చాలా బ్యాంకులు ముందుకొస్తున్నాయి. ఎన్నారై బ్యాంకింగ్‌ సర్వీస్‌లను అందించే బ్యాంకుల సంఖ్య గతంతో పోలిస్తే ప్రస్తుతం ఎక్కువైంది కూడా. భారత్‌లో బిల్లులను కట్టడానికి, ఎల్‌ఐసీ వంటి ఇన్సూరెన్స్‌లను కట్టడానికి ఎన్నారైలకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటోంది. అలాగే ఈ ఎన్నారై బ్యాంకింగ్‌ సర్వీసెస్‌ను ఉపయోగించుకుని అక్కడ నుంచి భారత్‌లో నివసిస్తున్న తమ వారికి డబ్బులు పంపించడం కూడా సులభమైంది. ఎన్నారైల అవసరాలను తెలుసుకున్న బ్యాంకులు ఎన్నారై, ఎన్‌ఆర్‌వో అకౌంట్లు అందిస్తున్నాయి. ఈ మేరకు అడ్వర్జైమెంట్లు కూడా గుప్పిస్తున్నాయి. ఐసీఐసీఐ బ్యాంకు అయితే బాలీవుడ్‌ స్టార్‌ హీరో షారూక్‌ ఖాన్‌ను తమ బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించుకుని ఎన్నారై బ్యాంకింగ్‌ సర్వీస్‌ను ప్రమోట్‌ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్నారై అకౌంట్‌ను ఓపెన్‌ చేయడానికి సురక్షితమైన బ్యాంకును ఎంచుకోవడం ఎలా అనేది ముఖ్యమైన విషయం. 

 
గుర్తుంచుకోవాల్సినవి:
1)బ్యాంకు ఉండే లోకేషన్‌. సులభంగా డబ్బులు వేయడానికి, తీయడానికి అందుబాటులో ఉంటుందో, లేదో చూసుకోవాలి. 
2)ఇక, ఎన్నారై బ్యాంక్‌ అకౌంట్లపై వడ్డీ రేట్లను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నిర్ణయిస్తుంది. ఇది అన్ని బ్యాంకులకు సమానంగానే ఉంటుంది. ఎవరైనా ఎక్కువ వడ్డీ చెల్లిస్తామని చెబితే నమ్మకూడదు.
3)అలాగే కొన్ని బ్యాంకులు కష్టమర్లను ఆకట్టుకోవడానికి ఫ్రీ గిప్ట్స్‌ను ప్రకటిస్తాయి. అయితే బహుమతులను బట్టి కాకుండా బ్యాంకు క్రెడిబులిటీని బట్టి అకౌంట్‌ ఓపెన్‌ చేయాలి. 
4)చాలా బ్యాంకులు తమ బ్యాంక్‌ ప్రమోషన్‌ కోసం భారీగా ఖర్చు పెడతాయి. కానీ కష్టమర్‌ సర్వీస్‌ను మాత్రం పెద్దగా పట్టించుకోవు. కాబట్టి ముందుగా కష్టమర్‌ సర్వీస్‌ గురించి ఎంక్వైరీ చేస్తే మంచిది. 
4)అలాగే మీరు ఎన్నారై అకౌంట్‌ ఓపెన్‌ చేసే బ్యాంక్‌ తాలూకు బ్రాంచ్‌ భారత్‌లోని మీ ప్రాంతానికి దగ్గర్లో ఉందో, లేదో తెలుసుకోవాలి.