యూఎస్‌ యూనివర్శిటీలో ప్రవేశం పొందడం ఎలా..?

 యూఎస్‌ యూనివర్శిటీల్లో ప్రవేశానికి కామన్‌ పద్దతి ఏదీ లేదు. ఏ యూనివర్శిటీలో చేరదలచుకున్నారో.. దానికి దరఖాస్తు చేయాలి. యూనివర్శిటీల్లో ప్రవేశాలకు ఏటికవే ప్రత్యేకమైన పద్దతిని అనుసరిస్తుంటాయి. చాలా వరకూ ప్రవేశ పరీక్ష, వ్యాస పరీక్ష వంటి వాటిని అనుసరిస్తున్నాయి. విద్యార్థుల అకాడమిక్‌ స్టేటస్‌ను, వ్యక్తిగత స్టేట్‌మెంట్‌ను కూడా అడుగుతుంటాయి. ఈ పద్దతి అంతా పూర్తయిన తర్వాత మీ వివరాలన్నీ ఇంటర్నేషనల్‌ స్టూడెంట్‌ డేటాబేస్‌లో రిజిస్టర్‌ అవుతాయి. దీనికి ఫీజుగా 20 డాలర్లు తీసుకుంటారు. కొన్ని యూనివర్శిటీలు ఆన్‌లైన్‌ విధానం ద్వారా ఈ సర్వీసును ఉచితంగా అందిస్తున్నాయి. అయితే దీనితో సంబంధం లేకుండా అథ్లెటిక్‌, క్రీడలకు సంబంధించిన ప్రవేశాలకు ప్రత్యేకమైన పద్ధతిని అనుసరిస్తుంటాయి. ఆయా యూనివర్శిటీల వెబ్‌సైట్లలో దీనికి సంబంధించిన సమాచారం ఉంటుంది.