Vijay-Devarakonda-in-France

ఫ్రాన్స్‌లో ఎంజాయ్ చేస్తున్న విజయ్ దేవరకొండ

విజయ్‌ దేవరకొండ ఇప్పుడు ఫ్రాన్స్‌లో ఉన్నారు. రొమాంటిక్‌ సన్నివేశాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. క్రియేటివ్‌ కమర్షియల్స్‌ పతాకంలో విజయ్‌ దేవరకొండ హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌ నిమిత్తమే ప్రస్తుతం విజయ్‌ ఫ్రాన్స్‌ వెళ్లారు. ఈ చిత్రానికి క్రాంతిమాధవ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. కె.ఎస్‌.రామారావు సమర్పిస్తున్నారు. కె.ఎ.వల్లభ నిర్మాత. కె.ఎస్‌.రామారావు మాట్లాడుతూ ‘‘ప్రస్తుతం మా సినిమా చిత్రీకరణ ఫ్రాన్స్‌లో జరుగుతోంది. ఈ భారీ షెడ్యూల్లో కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తాం. రొమాంటిక్‌ ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరీ ఇది. ఎంటర్‌టైనింగ్‌ వేలో సాగుతుంది. క్రాంతిమాధవ్‌ సినిమాలో కనిపిస్తుంది’’ అని అన్నారు. ఈ చిత్రంలో రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేశ్‌, ఇజాబెల్లె దె నాయికలు. గోపీసుందర్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. జేకే సినిమాటోగ్రాఫర్‌.