take-a-look-at-what-Heroine-hansika-doing-in-turkey-

టర్కీలో హన్సిక ఏం చేస్తుందో తెలుసా?.. మీరూ ఓ లుక్కేయండి..

టర్కీ: ముంబై బ్యూటీ హన్సిక షూటింగ్‌ లేని సమయాల్లో విదేశీ టూర్లకు వెళ్లి ఎంజాయ్‌ చేస్తూ వుంటుంది. ఈ క్రమంలో ఇటీవలే ఆమె టర్కీకి వెళ్లింది. ఆ దేశంలోని కపడోక్కా అనే చిహ్నీలకు ప్రసిద్ధి చెందిన ప్రదేశాన్ని సందర్శించింది. అక్కడ లొకేషన్లు ఆమెకి బాగా నచ్చేశాయట. అందుకే అక్కడ మట్టితో కుండలు తయారుచేసే కార్మికులను కలుసుకుని మాటలు కలిపింది. ఆ తర్వాత వారితో కలిసి సరదాగా తను కూడా కుండలు తయారు చేసింది. ఆ ఫోటోలను ట్విట్టర్‌లో షేర్‌ చేసింది. కాగా, ప్రస్తుతం హన్సిక తమిళంలో ఒక హారర్‌ చిత్రంలో నటిస్తోంది. దర్శక ద్వయం హరీష్‌ నారాయణన్‌, హరీష్‌ కల్యాణ్‌లు సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఈ ముంబైతార దెయ్యం పాత్రలో కనిపించనుంది. విలన్‌ స్వార్థం కారణంగా చిక్కుల్లో పడే ముగ్గురు అమాయక యువకులను ఆత్మగా వచ్చిన హన్సిక ఎలా రక్షించిందన్నదే ఆ చిత్ర కథ. ఇందులో క్రికెటర్‌ శ్రీశాంత్‌ కూడా కీలకపాత్రలో నటిస్తున్నాడు.