Syeraa-crosses-2million-mark-in-Overseas

ఓవర్సీస్‌లో రెండు మిలియన్ల క్లబ్బులోకి దూసుకెళ్లిన ‘సైరా’..

ఓవర్సీస్ సినిమా: మెగాస్టార్ చిరంజీవి హీరోగా శ్రీమ‌తి సురేఖ కొణిదెల స‌మ‌ర్ప‌ణ‌లో కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ బ్యాన‌ర్‌పై రామ్‌చ‌ర‌ణ్ నిర్మాత‌గా సురేంద‌ర్‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన భారీ హిస్టారిక‌ల్ చిత్రం ‘సైరా న‌ర‌సింహారెడ్డి’. బాలీవుడ్ సూప‌ర్ స్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్‌, కిచ్చా సుదీప్‌, విజ‌య్ సేతుపతి, న‌య‌న‌తార‌, త‌మ‌న్నా, ర‌వికిష‌న్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన ఈ చిత్రం అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలైంది. మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్‌ తెచ్చుకున్న ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద రికార్డులను క్రియేట్ చేస్తూ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఓవర్సీస్‌లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్న ఈ చిత్రం.. వాటిని తట్టుకొని నిలబడి, కలెక్షన్లలో దూసుకెళ్తోంది. తాజాగా ఈ చిత్రం ఓవర్సీస్‌లో 2 మిలియన్ డాలర్ల(రూ.14కోట్లపైగా)పైగా కలెక్షన్లు సాధించింది. ఈ కలెక్షన్లతో ఓవర్సీస్‌లో రెండు మిలియన్లపైగా వసూళ్లు సాధించిన చిత్రాల క్లబ్బులో ‘సైరా నరసింహారెడ్డి’ చేరింది.