Sye-Raa-Vijayotsavam-in-Houston

హ్యూస్టన్‌లో మెగా అభిమానుల విజయ సైరోత్సవం

హ్యూస్టన్‌: మొదటి తెలుగు స్వాతంత్ర్య పోరాట యోధుడు ఉయ్యలవాడ నరసింహరెడ్డి జీవితగాథ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన 'సైరా' చిత్రం ఘనవిజయం సాధించిన సందర్భంగా అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం హ్యూస్టన్ నగరంలో మెగా అభిమానులు సైరోత్సవాలు జరుపుకున్నారు. రాం పురం, సురేష్ పగడాల, బిర్యానీ-ఎన్-గ్రిల్ రెస్టారంట్ వారి సౌజన్యంతో జరిగిన ఈ విజయోత్సవాలలో సుమారు రెండు వందలకు పైగా హ్యూస్టన్ మెగా అభిమానులు పాల్గొన్నారు. రాజేష్ యాళ్ళబండి ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరించారు.
 
ఉయ్యలవాడ వారి వారసులు శ్రీనివాస్ గారిని మెగా టెక్సాస్ సినిమా డిస్త్రిబ్యూటర్లు రవి వర్రే, బద్రుద్ధీన్ పిత్తర్, హ్యూస్టన్ మనబడి కోఆర్డినేటర్ గోపాల్ గూడపాటి, వేణు పెట్టపాతి, కిషోర్ కునధరాజు, విషాల్ అన్నే, రాజ్ యల్లాప్రగడ ఘనంగా సన్మానించారు. మంచి సినిమా కరువైన ఈ రోజుల్లో ఒక గొప్ప స్వాతంత్ర్యయోధుడి జీవిత చరిత్రను ఈ తరానికి పరిచయం చేసిన చిరంజీవికి ప్రత్యేక కృతజ్ణతలు తెలిపారు. ఇంతటి మంచి సినిమాను అందించిన మెగా ప్రొడ్యూసర్ రాం చరణ్ తేజ్ తెగువకి, తెలుగు పోరాట యోధులపై ఆయనకున్న అభిమానాన్ని కొనియాడారు. డైరెక్టర్ సురేంర్ రెడ్డి ప్రతిభ, పాత్రలను మలచిన నేర్పు, సినిమా ఆద్యంతం  ఆకట్టుకున్న తీరు, ప్రీ-క్లైమేక్స్ నుంచి మహావీరుని మరణం వరకూ కథ నడిపిన విధానాన్ని అతిథులు ప్రశింసించారు.    
 

చిన్నారి కైవల్య కునధరాజు “మా తెలుగు తల్లి” గీతంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. చిన్నారులు గాదె సహస్ర, గాదె శౌర్యలు "తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలెచెదమా", నాగబాబు కూనసాని ఆలపించిన "వందేమాతరం" గీతాలతో అలరించారు. వీరనారి ఝాన్సీ లక్ష్మీభాయ్‌గా చిన్నారి సంహిత పొన్నుగంటి చేసిన ఏకపాత్రాభినయం సభికులందరినీ అమితకంగా ఆకట్టుకుంది. డాక్టర్ హనుమాన్ గాదె గారు చేసిన దుర్యోధన ఏకపాత్రాభినయానికి అభిమానులను మైమరిపించింది. చిన్నారుల ఆటపాటలు, పేట్రియాటిక్ సాంగ్స్, ఫేన్సీ డ్రస్ కాంపిటేషన్లతో ఈ విజయోత్సవాల కార్యక్రమం కోలాహాలంగా జరిగింది. హ్యూస్టన్ మెగా ఫ్యాన్స్, ఎన్నారైలందరికీ రాం చరణ్, అఖిల భారత చిరంజీవి అభిమానుల సంఘం అధ్యక్ష్యులు రవణం స్వామినాయుడు తమ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. 

రేడియో హంగామా శ్రీధర్ దాడి ఈ కార్యక్రమాన్ని తమ లైవ్ రేడియో శ్రోతలకు వినిపించారు. తాజాగా 'సైరా' చిత్రం రెండు మిలియన్ డాలర్ల కలెక్షన్ల క్లబ్బులోకి చేరిన సందర్భంగా శ్రీ ఉయ్యలవాడ కుటుంబ సభ్యులతో, జన్మదినోత్సవం జరుపుకుంటున్న చిన్నారులచేత విజయోత్సవ కేక్ కట్ చేయించారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన బిర్యానీ-ఎన్-గ్రిల్ రెస్టారంట్ యాజమాన్యానికి, వెంకట్ శీలం, సురేష్ సత్తి, లోవా రామిశెట్టి, చైతన్య కూచిపూడి, గంగాధర్ మోసూరు, జై కుమార్ తన్నీరు, సందీప్ రామినేని, రాజు మేరుగ, కళ్యాణ్ ఉప్పు, విజయ్ రాజనాల ప్రత్యేక ధన్యవాదాములు తెలియజేశారు. హ్యూస్టన్ వీరమహిళలు, చిన్నారులు పాడిన జాతీయ గీతం "జన గణ మన"తో విజయ సైరోత్సవ కార్యక్రమం ముగిసింది.

ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి