Sye-raa-Beats-Records-of-Sahoo-in-US

అమెరికాలో సాహో రికార్డును కొల్లగొట్టిన సైరా

స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత‌గాథ‌ను ఆధారంగా చేసుకుని తెర‌కెక్కించిన చిత్రం `సైరా న‌ర‌సింహారెడ్డి`. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో నటుడు రామ్‌చ‌ర‌ణ్ భారీ ఖర్చుతో నిర్మించిన ఈ చిత్రం బుధవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి, నయనతార, తమన్నా ప్రధాన పాత్ర‌లలో న‌టించిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తోంది. గాంధీ జ‌యంతి సంద‌ర్భంగా విడుద‌లైన ఈ చిత్రం హిట్ టాక్‌‌ను సొంతం చేసుకుని‌ మంచి వ‌సూళ్ల‌ను సాధిస్తోంది. దేశవ్యాప్తంగా మొదటిరోజు రూ. 50 కోట్ల కలెక్షన్లను సాధించినట్టు ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

 
విదేశాల్లోనూ సైరా చిత్రం రికార్డులను క్రియేట్ చేస్తోంది. ఓవర్సీస్‌లో మొదటిరోజు ఈ చిత్రం రూ.10 కోట్ల మార్క్‌ను సాధించినట్టు వార్తలొస్తున్నాయి. అమెరికాలో 308 లొకేష‌న్స్‌లో ప్రీమియ‌ర్స్‌ రూపంలో సైరా 8,57,765 డాల‌ర్ల(6.10 కోట్ల రూపాయ‌లు)ను రాబ‌ట్టింది. ప్రభాస్ నటించిన సాహో చిత్రానికి ప్రీమియర్ల ద్వారా 8.2 లక్షల డాలర్ల(రూ. 5 కోట్ల 83 లక్షలు) కలెక్షన్లు రాగా.. సైరా చిత్రం ఆ రికార్డును అధిగమించింది. ఆస్ట్రేలియాలోనూ సైరా చిత్రం ఉద‌యం 11 గంట‌ల వ‌ర‌కు 39 లొకేష‌న్స్‌లో 1,89,237 ఆస్ట్రేలియ‌న్ డాల‌ర్స్‌(రూ. 90.29 లక్షలు)ను సాధించింది. 
 
ఇదిలా ఉండగా.. చిరంజీవి 150వ చిత్రమైన ఖైదీ నెం.150 రికార్డును మాత్రం సైరా దాటలేకపోయింది. ఖైదీ నెం. 150 చిత్రం అమెరికాలో ప్రీమియర్ల ద్వారా 1.29 మిలియన్ డాలర్ల(రూ. 8 కోట్ల ద53 లక్షలు)ను రాబట్టి ప్రస్తుతం నాలుగో స్థానంలో నిలిచింది. మొదటి మూడు స్థానాలలో బాహుబలి: ది కన్‌క్లూజన్(3.5 మిలియన్ డాలర్లు), అజ్ఞాతవాసి(1.51 మిలియన్ డాలర్లు), బాహుబలి: ది బిగినింగ్(1.39 మిలియన్ డాలర్లు) చిత్రాలు ఉన్నాయి. లాంగ్‌రన్‌లో మాత్రం సైరా రికార్డులను క్రియేట్ చేస్తుందని అందరూ భావిస్తున్నారు. యూఎస్‌లో బుధ‌వారం సైరా మిలియన్ క్లబ్‌లో చేరనుంది. హిట్ టాక్‌ను సొంతం చేసుకోవడంతో ఈ చిత్రం మూడు మిలియన్ల మార్క్‌ను సునాయాసంగా దాటేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.