Saaho-movie-first-day-US-premiers-collections

అమెరికాలో ‘సాహో’ మూవీ యూఎస్ ప్రీమియర్స్ కలెక్షన్లివీ..

ఇంటర్నెట్ డెస్క్: భారీ అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా శుక్రవారం విడుదలైన చిత్రం ‘సాహో’. బాహుబలి తర్వాత వస్తున్న ప్రభాస్ చిత్రం కావడంతో సహజంగానే దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దానికితోడు భారీ బడ్జెట్‌, అద్భుతమైన నటీనటులు, హాలీవుడ్ టెక్నీషియన్స్ ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశారు. ఇన్ని అంచనాల మధ్య విడుదలైన సాహో ఓవర్సీస్ ప్రీమియర్ కలెక్షన్లు ఎలా ఉన్నాయో ఓ లుక్కేయండి.  యూఎస్ ప్రీమియర్స్ ద్వారా శుక్రవారం సాయంత్రానికి ‘సాహో’ 9,15,224 డాలర్లు(రూ.6.5 కోట్లపైగా) వసూలు చేసింది. దీంతో ఓవర్సీస్‌లో తొలిరోజు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఆరో స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో సుమారు రూ.22 కోట్లపైగా వసూళ్లతో ‘బాహుబలి 2: ద కంక్లూజన్’ తొలి స్థానంలో ఉండగా.. ఆ తర్వాతి స్థానాల్లో అజ్ఞాతవాసి - 1.5 మిలియన్ డాలర్లు(రూ.10కోట్లపైగా), బాహుబలి: ద బిగినింగ్ - 1.36 మిలియన్ డాలర్లు(రూ.9.5 కోట్లపైగా), ఖైదీ నంబర్ 150 - 1.2 మిలియన్ డాలర్లు(రూ.9.2 కోట్లపైగా), స్పైడర్ - 1మిలియన్ డాలర్లు(రూ.7కోట్లు) చిత్రాలున్నాయి.