Saaho-joins-3-million-dollar-club-in-US

యూఎస్‌లో ‘సాహో’ సునామీ.. ఎంత కొల్లగొట్టిందో తెలుసా..?

వాషింగ్టన్: బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన చిత్రం ‘సాహో’. ఒక్క సినిమా అనుభవమే ఉన్న సుజీత్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం తొలిరోజే డివైడ్ టాక్ తెచ్చుకుంది. అయినాసరే కలెక్షన్లలో మాత్రం దూసుకుపోతోంది. ఇప్పటికే హిందీ చిత్రసీమలో సత్తాచాటింది. సినిమాపై విమర్శలు గుప్పించిన వారందరికీ కలెక్షన్లతోనే సమాధానం చెబుతోంది. భారత్‌లోనే కాదు యూఎస్‌లోనూ ‘సాహో’ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. శనివారం సాయంత్రానికి సాహో.. యూఎస్‌లో 3 మిలియన్ డాలర్లు(రూ.21 కోట్లపైగా) కొల్లగొట్టింది. ఇప్పటి వరకు బాహుబలి: ద బిగినింగ్, బాహుబలి: ద కంక్లూజన్, రంగస్థలం, భరత్ అనే నేను చిత్రాలు మాత్రమే 3 మిలియన్ క్లబ్బులో ఉన్నాయి. దీంతో నార్త్‌అమెరికాలో ఈ ఫీట్ సాధించిన ఐదో చిత్రంగా సాహో నిలిచింది. డివైడ్ టాక్ వచ్చినప్పటికీ సాహో చిత్రం కలెక్షన్లలో దూసుకుపోతుండటం పట్ల ప్రభాస్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.