Rana,Jagapathi-Babu-works-hollywood-films

హాలీవుడ్ సినిమాలకు డబ్బింగ్ చెప్పిన రానా,జగపతిబాబు

హాలీవుడ్ సినిమాల్లో మనవాళ్లు నటించడం సాధ్యమా అనుకునేవాళ్లు. అది ఒకప్పటి మాట ప్రస్తుతం మనవాళ్లు కూడా హలీవుడ్‌లో అడుగుపెట్టేశారు. ప్రస్తుతం ప్రియాంక, దీపికలు హాలీవుడ్ తెరపై తమ సత్తాని చాటుతూ సినిమాలతో బిజీగా ఉన్నారు. టాలీవుడ్ హీరోలు హాలీవుడ్ సినిమాలకు పనిచేస్తున్నారు. కాకపోతే కనిపించరు.వినిపిస్తారు.అదేలాగంటే..కొన్ని హాలీవుడ్ చిత్రాలు సౌత్ భాషలలో రిలీజ్ అవుతుండడంతో వాటికి డబ్బింగ్ చెప్పేందుకు మన హీరోలు ముందుకొస్తున్నారు.

ఇటీవల ‘ది బి.ఎఫ్.జి’ అనే హాలీవుడ్ చిత్రానికి తెలుగులో జగపతి బాబు డబ్బింగ్ చెప్పి వారెవ్వా అనిపించాడు. ఇప్పుడు జగపతి బాటలో టాలీవుడ్ కండల వీరుడు రానా అడుగులు వేస్తున్నాడు. టామ్ హ్యాంక్స్ నటించిన ‘ఇన్ఫెర్నో’ అనే సినిమా అక్టోబర్ 28న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానుంది.. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాను తెలుగులో కూడా  విడుదల చేయబోతున్నారు. తెలుగు వర్షెన్‌కు రానా డబ్బింగ్ చెపుతున్నాడు. రోన్ హోవార్డ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇంగ్లీష్ లోనే కాక తెలుగులోను మంచి రికార్డులు క్రియేట్ చేస్తోందని సినీ విశ్లేషకులు పలుకుతున్నారట.