Rajini-film-blockbuster-

2.0: ‘బ్లాక్‌బస్టర్ కాదు.. మెగా బ్లాక్‌బస్టర్’

సూపర్‌స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ హీరో అక్షయ్‌కుమార్, అమీ జాక్సన్ ప్రధాన పాత్రల్లో లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘2.0’. సినిమా పోస్టర్లు రిలీజ్ అయిన నాటి నుంచే దీనిపై అంచనాలు ఓ రేంజ్‌‌లో పెరిగిపోయాయి. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో మొత్తం 10,500 స్క్రీన్‌‌లలో నవంబర్ 29న విడుదలైన ఈ సినిమా అంచనాలను మించి స్పందన తెచ్చుకుంటోంది. రిలీజ్ అయిన రెండు రోజుల్లోనే ఇంతవరకూ ఉన్న రికార్డులను బ్రేక్ చేస్తూ రూ. 150 కోట్లు రాబట్టి.. ఆ దూకుడును మరింత పెంచుతూ ఇప్పటివరకు 400 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. ఈ మేరకు కల్లెక్షన్స్ రిపోర్ట్ తెలుపుతూ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఇది బ్లాక్‌బస్టర్ కాదు.. మెగా బ్లాక్‌బస్టర్ అని తెలిపింది.

తాజాగా ఈ పోస్టర్‌ని ట్విట్టర్ ద్వారా షేర్ చేసిన అమీ జాక్సన్.. ఈ రేంజ్ సక్సెస్ రావటం పట్ల ఆనందం వ్యక్తం చేసింది. హాలీవుడ్ స్థాయి మూవీని భారతీయులు సైతం తీయగలరని 2.0తో నిరూపితమైందనే చెప్పుకోవచ్చు. ‘2.0’ స్పీడు చూస్తే సమీప కాలంలోనే గత రికార్డులను చెరిపేసి సరికొత్త రికార్డులు సృష్టించటం ఖాయం అంటున్నారు సినీ విశ్లేషకులు.