Rajamouli-in-talks-with-PR-Ajencies

హాలీవుడ్ పీఆర్ ఏజెన్సీలతో రాజమౌళి మంతనాలు

రాజమౌళి సినిమా తీయడంలోనే కాదు, తన సినిమా ప్రమోషన్‌లోనూ మాస్టరే! సినిమా షూటింగ్ మొదలుపెట్టినప్పటి నుంచే దాని ప్రమోషన్‌ను కూడా మొదలుపెట్టేస్తారు. దాంతో విడుదలయ్యే సమయానికి సినిమా మీద అంచనాలు ఎక్కడికో వెళ్లిపోతుంటాయి. గత సినిమాల్లాగానే తన తాజా సినిమా ‘ఆర్‌ఆర్‌ఆర్’కి ప్రమోషన్ పని మొదలుపెట్టేశారట! ఈ సినిమా ఇంగ్లీష్ వెర్షన్ సైతం డబ్ చేసి ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలన్న ఆలోచనలో ఉన్న రాజమౌళి హాలీవుడ్ పీఆర్ ఏజెన్సీలతో మంతనాలు జరుపుతున్నారట! అమెరికాలో గత కొంతకాలంగా తెలుగు సినిమాలు ఏవీ పెద్దగా సత్తా చాటడంలేదన్న సంగతి తెలిసిందే! తన సినిమా అలా కాకూడదన్న ఆలోచనతో హాలీవుడ్ పీఆర్ ఏజెన్సీల సహాయంతో అక్కడ విస్తృతంగా ప్రచారం చేయించాలని చూస్తున్నారట! ఇందులో భాగంగానే హాలీవుడ్ నటి ఒలివియాను ఈ సినిమాలో తీసుకున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి.