O-baby-team-getting-calls-from-China

ఓ బేబీ రివ్యూస్ చూసి.. చైనా నుంచి ఫోన్ చేస్తున్నారట!

సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, గురు ఫిలింస్, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, క్రాస్ పిక్చ‌ర్స్ ప‌తాకాల‌పై స‌మంత అక్కినేని, ల‌క్ష్మి, నాగ‌శౌర్య‌, రావు ర‌మేష్‌, రాజేంద్ర‌ప్ర‌సాద్ ప్ర‌ధాన తారాగ‌ణంగా బి.వి.నందినీ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం ‘ఓ బేబీ’. సురేష్ బాబు, సునీత తాటి, టి.జి.విశ్వప్ర‌సాద్‌, హ్యున్ హు, థామ‌స్ కిమ్ నిర్మాత‌లు. జూలై 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మ్యాజికల్ బ్లాక్ బస్టర్‌గా అటు ప్రేక్షకుల, ఇటు సినీ వర్గ ప్రముఖుల ప్రశంసలు పొందుతూ రికార్డ్ కలెక్షన్స్ సాధిస్తోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఆదివారం (జూలై 7)న రామానాయుడు స్టూడియోలో థాంక్స్ మీట్ ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ హీరో రానా దగ్గుపాటి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘ఇంద్ర’ ఫేమ్ నటుడు తేజ మాట్లాడుతూ.. ‘‘సురేష్‌బాబుగారు కొత్త‌వాళ్ల‌కు చాలా స‌పోర్ట్ ఇస్తారు. నాకు కూడా ఆయ‌న చాలా స‌పోర్ట్ చేశారు. ఇంత మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన నందినిగారికి చాలా థ్యాంక్స్. ఈ సినిమా ఆఫ‌ర్ నాకు పెద్ద గిఫ్ట్. స‌మంత గారిది గోల్డెన్ హ్యాండ్. ప్ర‌తి షాట్‌లో ఆమె అద్భుతమైన నటన కనబరిచారు. ఈ సినిమా నా కెరీర్‌లో ఎప్పటికీ గుర్తుండి పోయే సినిమా’’ అన్నారు.
 
నిర్మాత సునీత తాటి మాట్లాడుతూ.. ‘‘మేమందరం ఊహించిన దానికంటే రెట్టింపు రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాతో సమంత నిర్మాతలను సేవ్ చేస్తూ అక్రాస్ ది వరల్డ్ గొప్ప స్టార్ అవుతుందని ఒక నిర్మాతగా నమ్మకంగా చెప్పగలను. రివ్యూస్ చూసి చైనా నుంచి కాల్స్ వచ్చాయి. చైనాలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం, దీన్ని బట్టి అర్థం అవుతుంది సమంత పవర్ ఏంటో’’ అన్నారు. పీపుల్ మీడియా వివేక్ మాట్లాడుతూ.. ‘‘మంచి సినిమాలను ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్. ఈ సినిమాలో అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. అందుకే ప్రేక్షకులు ఇంతగా ఆదరిస్తున్నారు. ఇంత గొప్ప సినిమాలో నటించిన సమంత గారికి, దర్శకురాలు నందిని రెడ్డికి అభినందనలు’’ అన్నారు.
 
రైటర్ లక్ష్మి భూపాల్ మాట్లాడుతూ.. ‘‘సురేష్ బాబుగారు సినిమా బాగా వచ్చేవరకు సాన బెట్టారు. ఆయన అలా ఉండటం వల్లనేమో అన్ని సినిమాలు సక్సెస్‌లు అవుతున్నాయి. నందిని రెడ్డితో వర్క్ చేయడం చాలా కంఫర్ట్‌గా ఉంటుంది. జీవితంలో ఎంతో మంది బంధువులు ఉన్నా ఏదో ఒక లోటు అనేది ఉండేది. ఆ లోటుని తీర్చడానికి దేవుడు పంపిన సోల్ నందిని రెడ్డి. ఈ సినిమా మా అందరి సమిష్టి కృషి. కొన్ని సినిమాలు కొంత మంది జీవితాలను మార్చేలా చేస్తాయి. అలా ఈ సినిమా వలన ఒక రియల్ ఇన్సిడెంట్ నాకు ఒకతని ద్వారా మెసేజ్ వచ్చింది. నిజంగా ఇది అద్భుతం. మొదట ఫ్యామిలీ ఇంపార్టెంట్ ఆ తరువాతే మిగతావేమైనా... అలాంటి మాటలు చెప్పడానికి నా మాటలు ఉపయోగపడినందుకు గర్వంగా ఉంది. ఈ సినిమాలో డైలాగ్స్ కూడా ప్రశంసలు వస్తున్నాయి. అందుకు కారణం కథ, నందిని రెడ్డి. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్క ఆర్టిస్టు ఎంతో కష్టపడ్డారు కనుకే ఇంత గొప్ప విజయం అందింది. సీనియర్ యాక్టర్ లక్ష్మిగారికి నేను రాసిన డైలాగ్స్‌ను సమంత గారు లక్ష్మిగారిలోనికి పరకాయ ప్రవేశం చేసి ప్రాణం పోశారు’’ అన్నారు.