O-Baby-Joins-in-Million-Dollar-Club-In-US

మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరిన ‘ఓ బేబీ’

స‌మంత అక్కినేని టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం `ఓ బేబీ`. 70 ఏళ్ల బామ్మ‌.. 24 ఏళ్ల అమ్మాయిగా మారిన‌ప్పుడు ఏం జ‌రిగింద‌నే క‌థ‌తో ఈ సినిమా తెర‌కెక్కింది. నందిని రెడ్డి ద‌ర్శ‌కురాలు. జూలై 5న సినిమా విడుద‌లైంది. ఓ బేబీ ఇప్ప‌టి వ‌ర‌కు రూ.38 కోట్ల‌ను వ‌సూలు చేసిన‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు తెలియ‌జేశాయి. దీంతో ఈ చిత్రం స‌మంత కెరీర్‌లోనే అతి పెద్ద సోలో హిట్ మూవీగా నిలిచింది. తెలంగాణ‌, ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రాల నుంచి రూ.26.64 కోట్ల రూపాయ‌ల‌ను ఈ చిత్రం వ‌సూలు చేసింది. మరోపక్క యూఎస్‌లో ఈ చిత్రం వ‌న్‌ మిలియ‌న్ డాల‌ర్ క్లబ్‌లో చేరింది. మూడు వారాలు దాటిన‌ప్ప‌టికీ బాక్సాఫీస్ దగ్గర ఓ బేబీ తన స్టామినాను నిలబెట్టుకుంటోంది. లాంగ్ రన్‌లో ఈ చిత్రం 50 కోట్ల రూపాయల వ‌సూళ్ల‌ను రాబ‌డుతుందో లేదో చూడాలి మరి.