O-Baby-Crossed-Half-Million-Mark-in-US

యూఎస్‌లో హాఫ్ మిలియన్ మార్క్‌ను దాటిన ‘ఓ బేబీ’

మంత ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘ఓ బేబీ’. ఈ సినిమా జులై 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. మొదటి షో నుంచే హిట్ టాక్ తెచ్చుకోవడంతో బాక్సాఫీసు వద్ద ఈ చిత్రం కాసుల వర్షం కురిపిస్తోంది. ముఖ్యంగా సమంత 70 ఏళ్ల బామ్మ నటన అద్భుతంగా ఉండటంతో ఈ చిత్రం విజయవంతంగా దూసుకుపోతోంది. ప్రపంచవ్యాప్తంగా మూడు రోజుల్లో రూ. 17 కోట్ల గ్రాస్, రూ.8 కోట్ల షేర్ సాధించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నారు. వారాంతం వరకూ వసూళ్లు మరింత పెరిగే అవకాశాలున్నాయని అంటున్నారు.

ఇక అమెరికాలో ఓ బేబీ సినిమా మూడు రోజుల్లోనే హాఫ్ మిలియన్ (5 లక్షల డాలర్లు) మార్క్‌‌ను క్రాస్ చేసినట్టు ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటింగ్ సంస్థ రెడ్‌హార్ట్ మూవీస్ తెలిపింది. అమెరికాలోని 93 లొకేషన్లలో ఈ సినిమా విడుదలైందని, రెండో వారం నుంచి మరిన్ని లొకేషన్లను పెంచనున్నట్టు రెడ్‌హార్ట్ మూవీస్ చెప్పింది. ఓ బేబీ చిత్రం ప్రీమియర్ల ద్వారా లక్షా 45 వేల 637 డాలర్ల(దాదాపు రూ. కోటి) కలెక్షన్లను సాధించింది. ఎన్నారైలు సైతం ఈ సినిమాను ఎంతగానో ఆనందిస్తున్నారంటూ ఓ బేబీ టీమ్ ఆనందం వ్యక్తం చేసింది. కాగా ‘ఓ బేబీ’ కొరియన్ మూవీ ‘మిస్ గ్రానీ’కి రిమేక్‌గా వచ్చింది. దర్శకురాలు నందినీ రెడ్డి ఈ మూవీని తెరకెక్కించారు. సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలిమ్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కలిసి సంయుక్తంగా నిర్మించాయి. సమంతతో పాటు నాగశౌర్య, రావు రమేశ్, రాజేంద్ర ప్రసాద్, నటించారు.