Nani-Gang-Leader-Movie-Releasing-more-than-200-Theaters-in-USA

యూఎస్‌లో భారీగా విడుదల కాబోతున్న నాని 'గ్యాంగ్ లీడర్'

విక్రమ్ కే. కుమార్ డైరెక్షన్‌లో నేచురల్ స్టార్ నాని హీరోగా రూపొందిన చిత్రం 'గ్యాంగ్ లీడర్'. మైత్రీ మూవీ మేకర్స్ రూపొందిస్తున్న ఈ చిత్రం ఈ నెల 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నాని ఈ సినిమాలో ఐదుగురు ఆడవాళ్ల గ్రూప్‌నకు లీడర్‌గా, స్టోరీ రైటర్‌గా కనిపించబోతున్నాడు. ప్రియాంకా మోహన్ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీలో `ఆర్ఎక్స్100` ఫేమ్ కార్తికేయ విలన్‌గా కనిపించనున్నాడు. ఇతర కీలకపాత్రల్లో సీనియర్ నటులు లక్ష్మి, శరణ్య నటించారు. తమిళ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ స్వరాలు అందించారు. ఇక ఇటీవల విడుదలైన ట్రైలర్‌ను బట్టి చూస్తుంటే ఇదో రివేంజ్ డ్రామా స్టోరీ అని అర్థమవుతోంది. అలాగే ట్రైలర్ నాని తరహాలోనే కామెడీ, యాక్షన్ మేళవింపుతో ఉంది. ఇక ఈ నెల 13న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల కాబోతున్న ఈ మూవీని ఒవర్సీస్‌లో సరిగమ సినిమాస్ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. యూఎస్‌లో కూడా ఈ చిత్రాన్ని నాని కెరీర్‌లోనే ఇంతకుముందు ఎప్పుడు లేని విధంగా ఏకంగా 200 థియేటర్లలో విడుదల చేస్తున్నారు. కాగా, యూఎస్‌లో 12వ తేదీన 'గ్యాంగ్ లీడర్' ప్రీమియర్ షోలు ప్రదర్శించనున్నారు.