Maniratnam-starts-his-next-movie-in-Thailand

థాయ్‌లాండ్‌లో షురూ చేసిన మణిరత్నం

థాయ్‌లాండ్: ప్రముఖ ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో ప్రారంభ‌మైన భారీ చిత్రం `పొన్నియ‌న్ సెల్వ‌న్‌`. ప్ర‌ముఖ న‌వ‌ల పొన్నియ‌న్ సెల్వ‌న్ అనే న‌వ‌ల‌ను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై సుభాస్క‌ర‌న్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విక్ర‌మ్‌, కార్తి, జ‌యం ర‌వి, ఐశ్వ‌ర్యారాయ్‌, త్రిష‌, ఐశ్వ‌ర్య లేఖ త‌దిత‌రులు ఈ భారీ బడ్జెట్ చిత్రంలో న‌టిస్తున్నారు. కాగా.. ఈ సినిమా షూటింగ్ థాయ్‌లాండ్‌లో ప్రారంభ‌మైంది. 40రోజుల పాటు జ‌రిగే ఈ షెడ్యూల్‌లో కార్తి, జ‌యం ర‌వి మాత్ర‌మే పాల్గొంటారు. ఆస్కార్ అవార్డ్ విన్న‌ర్ ఎ.ఆర్‌.రెహ‌మాన్ సంగీతాన్ని అందిస్తున్నారు.