చిత్రజ్యోతి: ‘సరిలేరు నీకెవ్వరు’ విడుదలయ్యాక 3 నెలలు విరామం తీసుకుంటానని మహేశ్‌బాబు ముందుగానే చెప్పారు. సినిమా ప్రచార కార్యక్రమాలు పూర్తి చేసుకుని కుటుంబంతో కలిసి ఆయన న్యూయార్క్ వెళ్లారు. సతీమణి నమ్రత పుట్టినరోజును (జనవరి 22) న్యూయార్క్‌లో సెలబ్రేట్ చేశారు. ‘‘నా జీవితంలో మహిళ, మా ఇంటి మహిళకు పుట్టినరోజు శుభాకాంక్షలు. జస్ట్ లవ్ అండ్ మోర్ లవ్’’ అని మహేశ్ ట్వీట్ చేశారు.