ప్రేక్షకుల హృదయాల్లో కొన్ని చిత్రాలు ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకుంటాయి. అటువంటి చిత్రాల్లో గతేడాది విడుదలైన ‘కేరాఫ్ కంచరపాలెం’ ఒకటి. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రాన్ని న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించారు. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో ఆగస్టు 8 నుంచి 17 వరకూ జరగబోయే 10వ ‘ది ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్’లోనూ ప్రదర్శించనున్నారు. ‘కరేజ్’ (ధైర్యం) థీమ్‌తో ఈ ఏడాది చిత్రోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.