Jersey-collections

యూఎస్‌లో మాయ చేస్తున్న ‘జెర్సీ’..

ఇంటర్నెట్: ఇటీవల విడుదలైన తెలుగు సినిమాలన్నీ ఓవర్సీస్‌లో పరవాలేదనిపించుకొన్నాయి. ముఖ్యంగా మజిలీ, చిత్రలహరి సినిమాలు యూఎస్ మార్కెట్‌లో కూడా తమ మార్కు చూపాయి. అయితే ప్రస్తుతం వీటన్నింటినీ తోసిరాజంటూ.. నాని నటించిన ‘జెర్సీ’ సినిమా దూసుకుపోతోంది. పాజిటివ్ టాక్‌తో ఇప్పటికే మంచి సినిమా అనిపించుకున్న ఈ చిత్రం ఓవర్‌సీస్ కలెక్షన్లు కూడా బాగానే దండుకొంటోంది. ఆదివారం నాటికి ఇటీవల విడుదలైన తెలుగు చిత్రాల ఓవర్సీస్ కలెక్షన్ల వివరాలు ఓసారి పరిశీలిస్తే.. ఇప్పటికే రూ. కోటిపైగా కలెక్షన్లతో జెర్సీ ముందువరుసలో ఉంది. ఆ తర్వాతి స్థానంలో చిత్రలహరి నిలవగా.. మూడోస్థానాన్ని మజిలీ కైవసం చేసుకుంది. రాఘవ లారెన్స్ నటించిన హారర్ కామెడీ ‘కాంచన3’ కూడా మంచి కలెక్షన్లే సాధిస్తోంది.