Japan-Fans-Visited-Prabhas-House

‘బాహుబలి’ ఇంటి ముందు జపాన్ అభిమానుల సందడి

`బాహుబ‌లి` త‌ర్వాత యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్‌కు అంత‌ర్జాతీయ‌స్థాయిలో అభిమానులు ఏర్పడ్డారు. ముఖ్యంగా జ‌పాన్‌లో ప్ర‌భాస్‌, రానాల‌కు పెద్ద సంఖ్య‌లో అభిమానులు ఏర్ప‌డ్డారు. `బాహుబ‌లి` విడుద‌ల స‌మ‌యంలో ప్ర‌భాస్‌, రానా అక్క‌డ ప్రమోష‌న్స్‌కు వెళ్లిన‌ప్పుడు జ‌పాన్ అభిమానులు వారికి కొన్ని కానుక‌లు కూడా అందించారు. కాగా తాజాగా జ‌పాన్‌కు చెందిన కొంత మంది అమ్మాయిలు ప్ర‌భాస్‌ను క‌లుసుకోవ‌డానికి ఆయ‌న ఇంటికి వెళ్లారు. ప్ర‌భాస్ సాహో సినిమా చిత్రీక‌ర‌ణ‌తో బిజీగా ఉండ‌టంతో ప్ర‌భాస్ ఆ అభిమానుల‌ను క‌లుసుకోలేక‌పోయాడు. అయితే అభిమానులు మాత్రం ఆయ‌న ఇంటి ముందు డ్యాన్స్ చేసి త‌మ అభిమానాన్ని చాటుకున్నారు.