ఓవర్సీస్ సినిమా: శర్వానంద్, సమంత మొదటిసారిగా జంటగా నటించిన సినిమా జాను. శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన ‘జాను’ మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో శర్వానంద్, సమంత నటనకు ప్రేక్షకులు నూటికి నూరు మార్కులూ వేస్తున్నారు. సంగీతం కూడా ప్రేక్షకులను కట్టిపడేసినట్లు టాక్. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ.. వారి వారి తొలి ప్రేమ జ్జాపకాలను మళ్లీ గుర్తు చేసుకున్నట్లు చెబుతున్నారు. కాగా.. తమిళంలో విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన 96 సినిమాకు జాను రీమేక్ అన్న విషయం తెలిసిందే. 96 సినిమాను తమిళంలో చూసిన ప్రేక్షకులు డిస్సప్పాయింట్ కాకుండా దర్శకుడు జాగ్రత్త పడినట్లు తెలుస్తోంది. జాను సినిమాను దిల్‌రాజు నిర్మించగా.. ప్రేమ్‌కుమార్ తెరకెక్కించారు.