In-Overseas

విదేశాల్లో.. విశ్రాంతిలో..

ఇంటర్నెట్ డెస్క్: ఐరోపాలో మహేశ్‌బాబు కుటుంబం, ఆఫ్రికాలో రామ్‌చరణ్‌ దంపతులు విశ్రాంతి తీసుకుంటున్నారు. వేర్వేరుగా వేర్వేరు దేశాలకు విశ్రాంతి కోసం వెళ్ళిన వీరిద్దరూ ఇంకా ఇండియా రాలేదు. ‘మహర్షి’ విజయం సాధించిన సందర్భంగా మహేశ్‌ కుటుంబం సెలబ్రేట్‌ చేసుకుంటుంటే... ఈ నెల 14న వివాహ వార్షికోత్సవం సందర్భంగా రామ్‌చరణ్‌, ఉపాసన దంపతులు ఆఫ్రికా దేశాలకు వెళ్ళారు. ప్రస్తుతం వీరు టాంజానియాలో ఉన్నారు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో మహేశ్‌ సతీమణి నమ్రత, ఉపసాన పోస్ట్‌ చేసిన  ఫొటోలివి!