Great-India-Films-bought-Maharshi-overseas-rights

మహర్షి ఓవర్సీస్ రైట్స్‌ను దక్కించుకున్న గ్రేట్ ఇండియా ఫిల్మ్స్

‘భరత్ అనే నేను’ బ్లాక్‌బస్టర్ తరువాత సూపర్‌స్టార్ మహేష్‌బాబు నటించిన సినిమా మహర్షి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తికావొచ్చింది. ఇటీవలే రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ యూట్యూబ్‌లో రికార్డులను సృష్టిస్తోంది. రిలీజ్ అయిన 24 గంటల్లోనే కోటికి పైగా వ్యూస్ వచ్చాయంటే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ప్రీరిలీజ్ వేడుకకు సిద్దమవుతున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మే 9న విడుదలకానుంది. ఇప్పుడు తాజాగా మహర్షి సినిమా మరో రికార్డును బద్దలు కొట్టింది. ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్‌ అత్యధికంగా రూ.47.50 కోట్లకు అమ్ముడుపోయాయి. డిజిటల్ రైట్స్‌ రూపంలో ఇంత మొత్తం రాబట్టిన మొదటి చిత్రం(నాన్-బాహుబలి)గా మహర్షి రికార్డులకెక్కింది. అమెజాన్ ప్రైమ్ ఈ చిత్రాన్ని రూ. 11 కోట్లకు దక్కించుకోగా, టీవీ రైట్స్‌ను జెమిని టీవీ రూ. 14.5 కోట్లకు, ఆడియో రైట్స్‌ను ఆదిత్య మ్యూజిక్ రూ. 2 కోట్లకు దక్కించుకున్నాయి. హిందీ శాటిలైట్/డబ్బింగ్ రైట్స్ రూ. 20 కోట్లకు అమ్ముడుపోయాయి. ఇక ఓవర్సీస్ రైట్స్‌ను గ్రేట్ ఇండియా ఫిల్మ్స్ సంస్థ రూ. 12.5 కోట్లకు చేజెక్కించుకుంది. ఇండియాతో పాటు ఓవర్సీస్‌లోనూ ఈ చిత్రం భారీగా రిలీజ్ కానున్నట్టు తెలుస్తోంది.