Good-News-For-Cinema-Lovers-in-US---

అల వైంకుంఠపురంలో ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. టికెట్లపై డిస్కౌంట్లు..!

ఇంటర్నెట్ డెస్క్: అల వైకుంఠపురుములో సినిమాతో అల్లుఅర్జున్ పండుగ వాతావరణాన్ని ముందుగానే తీసుకొచ్చేందుకు సిద్దమయ్యాడు. సంక్రాంతి కానుకగా వస్తున్న ఈ చిత్రంపై తెలుగు ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర దేశాల్లోని తెలుగు వారు ఈ సినిమా కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అమెరికాలో తెలుగు చిత్రాలకు మిలియన్ డాలర్లలో కలెక్షన్లు వస్తున్నాయంటేనే అక్కడ మన సత్తా ఏంటో అర్థమవుతుంది. భారతదేశంలో ఉన్నవారు సొంతూర్లలో కుటుంబంతో కలిసి సంక్రాంతి పండుగ చేసుకుంటే.. విదేశాల్లో ఉన్న తెలుగు వారు సంక్రాంతి కానుకగా విడుదలయ్యే సినిమాలను చూసి పండుగ చేసుకుంటారనే నానుడి కూడా ఉంది. 

అమెరికాలో అల వైకుంఠపురములో చిత్రాన్ని బ్లూస్కై సినిమాస్ విడుదల చేస్తోంది. అమెరికాలో 11వ తేదీన చిత్ర ప్రీమియర్ షోలను ప్రదర్శించనున్నారు. ఈ చిత్రం వీకెండ్‌కు రీలీజ్ అవుతుండటంతో.. ఓపెనింగ్ కలెక్షన్లు భారీగా ఉంటాయని ట్రేడ్ పండితులు ఆశిస్తున్నారు. ఇదే సమయంలో ప్రేక్షకులను థియేటర్లకు తీసుకువచ్చేలా అమెరికాలోని అనేక థియేటర్ల సంస్థలు పలు ఆఫర్లను కూడా ప్రకటించాయి. అల వైకుంఠపురములో సినిమా టిక్కెట్ ధర అమెరికాలో దగ్గర దగ్గరగా 14 డాలర్లుగా ఉంది. కొన్ని లొకేషన్లలో ఈ ధర అటు ఇటుగా ఉండచ్చు. అయితే ఈ ధరపై అనేక డిస్కౌంట్లు కూడా లభిస్తున్నాయి. 

అమెరికాలోని సినిమార్క్ సినిమాస్.. సినిమార్క్ మూవీ క్లబ్ పాస్ ఉన్న వారికి సెలక్టెట్ లొకేషన్లలో టిక్కెట్ ధరపై ఐదు డాలర్ల డిస్కౌంట్ ఇస్తున్నట్టు ప్రకటించింది. మరోపక్క రీగల్ సినిమాస్.. రీగల్ అన్‌లిమిటెడ్ పాస్ ఉన్నవారికి కొన్ని లొకేషన్లలో ఉచితంగా టిక్కెట్లను ఇస్తోంది. మరికొన్ని లొకేషన్లలో కేవలం రెండు డాలర్లకే అల వైకుంఠపురములో టిక్కెట్లను ఇస్తున్నట్టు రీగల్ సినిమాస్ బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. అదే విధంగా ఏఎమ్‌సీ సంస్థ తమకు సంబంధించిన ఏఎమ్‌సీ స్టబ్స్ ఏ-లిస్ట్ ఖాతాదారులకు ఉచితంగా టిక్కెట్లను ఇస్తోంది. వీళ్లతో పాటు ఆటమ్ టిక్కెట్స్ కంపెనీ.. తమ వెబ్‌సైట్/యాప్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసి.. చేజ్ పే ద్వారా చెక్ అవుట్ అయిన వారికి ఏడు డాలర్ల డిస్కౌంట్ ఇస్తున్నట్టు తెలిపింది.

అమెరికాతో పాటుగా ఆస్ట్రేలియా, కెనడాలలోనూ తెలుగు వారు అధిక సంఖ్యలో ఉన్నారు. అమెరికా తరువాత ఆశించదగ్గ స్థాయిలో కలెక్షన్లు ఈ రెండు దేశాల నుంచే వస్తున్నట్టు చెప్పుకోవాలి. ఈ రెండు దేశాలతో పాటు న్యూజిలాండ్, యూకే, మలేషియా తదితర దేశాల్లోనూ అల వైకుంఠపురములో చిత్రం విడుదలవుతోంది. ఇప్పటికే చిత్ర నిర్మాతలు, ఆయా దేశాల డిస్ట్రిబ్యూటర్లు థియేటర్ల లిస్ట్‌ను సైతం ప్రకటించారు.
 

ఇదిలా ఉండగా.. అల్లుఅర్జున్ చివరి చిత్రం నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా చిత్రం విడుదలై దాదాపు రెండేళ్లు గడుస్తోంది. ఈ సినిమా పరాజయం పాలవడం.. అప్పటి నుంచి ఇప్పటివరకు అల్లు అర్జున్ మరో చిత్రం విడుదల చేయకపోవడంతో ఈ సినిమాపైనే అల్లు ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. అంతేకాకుండా యూఎస్‌లో అల్లుఅర్జున్ గత చిత్రాలు రికార్డు స్థాయిలో కలెక్షన్లను రాబట్టలేకపోయాయి. తెలుగు ఇండస్ట్రీలోని దాదాపు అగ్రహీరోలందరూ యూఎస్‌లో 2 మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరగా.. అల్లుఅర్జున్ మాత్రం ఈ క్లబ్‌లో ఇంకా చేరలేకపోయాడు. 

అల్లుఅర్జున్ నటించిన రేసుగుర్రం, సన్ ఆఫ్ సత్యమూర్తి, దువ్వాడ జగన్నాథం సినిమాలు అమెరికాలో మిలియన్ మార్క్‌ను దాటినప్పటికీ.. 2 మిలియన్ డాలర్ల క్లబ్‌లో మాత్రం చేరలేకపోయాయి. అల వైకుంఠపురములో చిత్రం ద్వారా అల్లుఅర్జున్ 2 మిలియన్ క్లబ్‌లో చేరడం ఖాయమంటూ అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గత చిత్రాలైన అరవింద సమేత, అజ్ఞాతవాసి, అఆ చిత్రాలు అమెరికాలో 2 మిలియన్ క్లబ్‌లో చేరగా.. అల వైకుంఠపురములో చిత్రం కూడా యూఎస్‌లో కొత్త రికార్డులను సృష్టించడం ఖాయమంటూ ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు. క్లబ్‌లో చేరలేదు.