Disney-to-remove-Fox-from-20th-Century-film-studio-name

కనుమరుగు కానున్న ‘ఫాక్స్’ పదం.. హాలీవుడ్‌లో..

హాలీవుడ్‌లో ఎన్నో అద్భుత చిత్రాల నిర్మాణానికి వేదికగా నిలిచిన ట్వంటీయత్‌  సెంచరీ ఫాక్స్‌ స్టూడియో పేరులోని ‘ఫాక్స్‌’ పదం ఇకపై కనుమరుగు కానుంది. 75 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ స్టూడియోను వాల్ట్‌ డిస్నీ పిక్చర్స్‌ సంస్థ గత ఏడాది 71.3 అమెరికన్‌ బిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేసిన తర్వాత చోటుచేసుకొన్న మార్పుల్లో ఇది ప్రధానమైంది. ఇక ‘ఫాక్స్‌’ పేరు లేకుండా ‘ట్వంటీయత్‌ సెంచరీ స్టూడియోస్‌’గా, ‘ఫ్యాక్స్‌ సెర్చ్‌లైట్‌ పిక్చర్స్‌’ సంస్థను ‘సెర్చ్‌లైట్‌ పిక్చర్స్‌’ గా పిలుస్తారు. అయితే టీవీ సీరియల్స్‌ నిర్మించే ‘ట్వంటీయత్‌ సెంచరీ ఫాక్స్‌ టెలివిజన్‌’, ‘ఫాక్స్‌ ట్వంటీఫస్ట్‌ టెలివిజన్‌ స్టూడియోస్‌’ పేర్లు కూడా మారుస్తారా లేదా అన్నది ఇంకా నిర్ధారణ కాలేదు. ‘ఫాక్స్‌’ పదం తొలగించిన తర్వాత ట్వంటీయత్‌ సెంచరీ బేనరులో విడుదలవుతోన్న తొలి చిత్రం ‘కాల్‌ ఆఫ్‌ వైల్డ్‌’. అలాగే సెర్స్‌లైట్‌ పిక్చర్స్‌ బేనరుపై వస్తున్న మొదటి చిత్రం ‘డౌన్‌ హిల్‌’.